News January 24, 2025

Stock Markets: బ్యాంకు, ఫార్మా, మీడియా, హెల్త్‌కేర్ షేర్లు డౌన్

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు రేంజుబౌండ్లో కొనసాగుతున్నాయి. ఉదయం మోస్తరు లాభాల్లో మొదలైన బెంచ్‌మార్క్ సూచీలు ప్రస్తుతం ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 23,208 (+2), సెన్సెక్స్ 76,533 (+13) వద్ద చలిస్తున్నాయి. IT, మెటల్, రియాల్టి, O&G షేర్లు పుంజుకున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఆటో, ఫార్మా, మీడియా, హెల్త్‌కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. పవర్‌గ్రిడ్, JSW స్టీల్, BPCL, NTPC, టాటా స్టీల్ టాప్ గెయినర్స్.

Similar News

News January 24, 2025

ట్రెండింగులో #AttackOnBSF

image

రెండు వారాల క్రితం సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న BSF జవాన్లపై బంగ్లాదేశీ పశువుల స్మగ్లర్లు అటాక్ చేశారు. జీవాలను తీసుకెళ్తుండగా ప్రశ్నించడంతో పదునైన వస్తువులతో వారి గొంతు, మెడ, ఛాతీ, తొడలపై దాడి చేశారు. కుటదా బోర్డర్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో మన జవాన్లపై ఇంకెంత కాలం ఇలాంటి దారుణాలని ప్రశ్నిస్తూ నెటిజన్లు #AttackOnBSFను ట్రెండ్ చేస్తున్నారు.

News January 24, 2025

CID చేతికి కిడ్నీ రాకెట్ వ్యవహారం?

image

HYD సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసును ప్రభుత్వం CIDకి బదిలీ చేసే అవకాశముంది. ఇప్పటికే వైద్యశాఖ సమావేశంలో అధికారులు దీనిపై చర్చించారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 నెలలుగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నట్లు తేల్చారు. ఒక్కో ఆపరేషన్‌కు ₹50లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ ఉన్నట్లు సమాచారం.

News January 24, 2025

కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫ్రీగా మ్యాచ్ చూడొచ్చు

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపు 13 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్నారు. ఈ నెల 30న రైల్వేస్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగుతారు. ఈ క్రమంలో ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ జరిగే అరుణ్ జైట్లీ స్టేడియంలోకి ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. కాగా విరాట్ చివరిసారి 2012లో రంజీ మ్యాచ్‌లో ఆడారు.