News February 28, 2025
Stock Markets: బ్లడ్‌బాత్.. విలవిల

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మెక్సికో, కెనడా, చైనాపై టారిఫ్స్ మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించడం నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. నిఫ్టీ 22,265 (-280), సెన్సెక్స్ 73,690 (-930) వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంక్స్, O&G షేర్లు విలవిల్లాడుతున్నాయి. కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్, గ్రాసిమ్ టాప్ గెయినర్స్.
Similar News
News February 28, 2025
మంత్రులకు చేపకూర, విద్యార్థులకు పస్తులా?: కేటీఆర్

TG: రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్ఠకు చేరిందని మాజీ మంత్రి KTR విమర్శలు చేశారు. SLBC ప్రమాదంతో ఓ వైపు విషాదం నెలకొంటే మంత్రులు హెలికాప్టర్ యాత్రలు, చేపకూర విందులతో వినోదం పొందుతున్నారని దుయ్యబట్టారు. అచ్చంపేట నియోజకవర్గం కొండనాగులలోని ఎస్టీ బాలురు హాస్టల్ విద్యార్థులను శివరాత్రి రోజున గుడిలో అన్నదానానికి వెళ్లి తినమనడం దారుణమన్నారు. పండగపూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలనా అని ప్రశ్నించారు.
News February 28, 2025
యువతపైనే దేశ రక్షణ బాధ్యత: సీఎం రేవంత్

TG: దేశ రక్షణలో తెలంగాణ పాత్ర కీలకంగా ఉందని సీఎం రేవంత్ చెప్పారు. BDL, HAL, మిధాని వంటి కీలక సంస్థలు ఇక్కడే ఉన్నాయన్నారు. గచ్చిబౌలిలో జరిగిన ‘విజ్ఞాన్ వైభవ్’ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. సైన్స్ ప్రదర్శనతో విద్యార్థులకు దేశం పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు. దేశ రక్షణ బాధ్యత యువతపై ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
News February 28, 2025
మళ్లీ MLAలుగా గెలవాలంటే పనితీరు మారాలి: చంద్రబాబు

AP: రాష్ట్ర బడ్జెట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. దీనిపై వారికి అవగాహన పెంచాలని సూచించారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో సీఎం మాట్లాడారు. ‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే పనితీరు బాగుండాలి. మళ్లీ సభకు రావాలనే భావనతో పని చేయాలి. విభేదాలు, గ్రూపులను సహించను. ఎంపీలతో కలిసి సమన్వయం చేసుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.