News June 3, 2024
స్టాక్ మార్కెట్ల జోరు.. ₹12.48L cr లాభం
ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో స్టాక్ మార్కెట్లు భారీ <<13366755>>లాభాల్లో<<>> కొనసాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.12.48 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందారు. PSU బ్యాంకులు, ఆయిల్, గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్స్, రియాల్టీ, ఆటో రంగాలు 3-5 శాతం లాభాలు పొందాయి. ఇవాళ ఒకానొక దశలో సెన్సెక్స్ 2,621 పాయింట్ల లాభంతో 76,583, నిఫ్టీ 800 పాయింట్ల లాభంతో 23,227 పాయింట్ల గరిష్ఠాలను తాకాయి.
Similar News
News September 13, 2024
జోగి రమేశ్, అవినాశ్‌కు సుప్రీంలో స్వల్ప ఊరట
AP: TDP ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో YCP నేతలు జోగి రమేశ్, దేవినేని అవినాశ్‌కు సుప్రీంకోర్టు స్వల్ప ఊరట కల్పించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. సాంకేతిక కారణాలతో ఇవాళ పూర్తి స్థాయి విచారణ చేపట్టలేకపోతున్నామంది. నిందితులు 24 గంటల్లో పాస్ పోర్టులు అప్పగించాలని, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలంది. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు సుప్రీంను ఆశ్రయించారు.
News September 13, 2024
భారీగా పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.1300 పెరిగి రూ.74,450కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1200 పెరిగి రూ.68,250 పలుకుతోంది. ఇక వెండి ధర ఏకంగా కేజీ రూ.3,500 పెరిగి రూ.95వేలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని చోట్ల దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 13, 2024
కెనడాలో ఖలిస్థానీల బాంబు దాడి: పంజాబ్‌లో NIA సోదాలు
కెనడాలోని భారత హైకమిషన్‌పై ఖలిస్థానీ సపోర్టర్ల బాంబు దాడి కేసులో NIA పంజాబ్‌లో సోదాలు చేపట్టింది. ఉదయం నుంచే అధికారులు కొందరి ఇళ్లు, కార్యాలయాల్లో రైడ్స్ చేస్తున్నారని తెలిసింది. 2023, మార్చి 23న ఒట్టావాలో హై కమిషన్ ముందు దేశవ్యతిరేక నినాదాలు చేసిన ఖలిస్థానీలు త్రివర్ణ పతాకాలు తొలగించి తమ జెండాలు పాతారు. భవంతిలోకి 2 గ్రెనేడ్లు విసిరారు. దీనిపై నిరుడు జూన్‌లో NIA కేసు నమోదు చేసింది.