News March 10, 2025

‘మండే’పోయిన Stock Markets

image

స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 74115 (-217), నిఫ్టీ 22460 (-92) వద్ద ముగిశాయి. అనిశ్చితి, ట్రంప్ టారిఫ్స్, US షట్‌డౌన్ అంశాలు సూచీలను పడేశాయి. FMCG షేర్లు ఎగిశాయి. రియాల్టి, PSUబ్యాంకు, O&G, వినియోగం, ఎనర్జీ, ఆటో, తయారీ, మెటల్, హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకు షేర్లు ఎరుపెక్కాయి. పవర్‌గ్రిడ్, HUL, ఇన్ఫీ, SBI లైఫ్, నెస్లే, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్. ONGC, ట్రెంట్ టాప్ లూజర్స్.

Similar News

News March 10, 2025

అస్సాంకు సొంత ఉపగ్రహం

image

త్వరలో ‘అస్సాంశాట్’ అనే సొంత ఉపగ్రహాన్ని లాంఛ్ చేయనున్నట్లు అస్సాం ఆర్థిక మంత్రి అజంతా నియోగ్ ప్రకటించారు. సరిహద్దులపై నిఘాకు, కీలక సామాజిక-ఆర్థిక ప్రాజెక్టులపై సమాచారం కోసం ఈ శాటిలైట్‌ను వాడనున్నట్లు పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, విపత్తు నిర్వహణ, వ్యవసాయానికి కూడా అది ఉపకరిస్తుందని వివరించారు. ప్రయోగం పూర్తైతే సొంత శాటిలైట్ ఉన్న తొలి రాష్ట్రంగా అస్సాం నిలవనుంది.

News March 10, 2025

రామగుండం ఎయిర్‌పోర్ట్ సాధ్యం కాదు: కేంద్రం

image

TG: పెద్దపల్లి(D) రామగుండంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని స్థానిక MP గడ్డం వంశీ చేసిన ప్రతిపాదనలపై కేంద్రం స్పందించింది. ‘ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటు సాధ్యం కాదు. చుట్టూ కొండలు, ఎయిర్‌స్పేస్‌పై IAF ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. ఒక వేళ ప్రభుత్వం నుంచి వస్తే పరిశీలిస్తాం’ అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు MPకి రిప్లై ఇచ్చారు.

News March 10, 2025

ICC ఛాంపియన్స్ ట్రోఫీ టీం.. రోహిత్‌కు దక్కని చోటు

image

CT-2025 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను ICC ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఆరుగురికి చోటు దక్కింది. కెప్టెన్‌గా సాంట్నర్(NZ)ను తీసుకుంది. IND నుంచి కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, షమీ, వరుణ్, అక్షర్ పటేల్(12వ ప్లేయర్)లకు చోటిచ్చింది. రచిన్, ఇబ్రహీం, ఫిలిప్స్, అజ్మతుల్లా, హెన్రీలను మిగతా సభ్యులుగా చేర్చింది. అయితే తన కెప్టెన్సీతో INDను ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ను ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

error: Content is protected !!