News January 28, 2025

Stock Markets: పుల్‌బ్యాక్ ర్యాలీకి అవకాశం

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు లాభాల్లో మొదలవ్వొచ్చు. గిఫ్ట్‌నిఫ్టీ 110 PTS పెరగడం దీనినే సూచిస్తోంది. ఇప్పటికే సూచీలన్నీ ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్లడంతో పుల్‌బ్యాక్ ర్యాలీకి ఆస్కారముంది. ఆసియా, గ్లోబల్ మార్కెట్ల నుంచీ మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి. డాలర్ ఇండెక్స్, US బాండ్ ఈల్డుల పెరుగుదల ఆందోళనకరం. నిఫ్టీకి సపోర్టు 22790, రెసిస్టెన్సీ 22,959 వద్ద ఉన్నాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటమే మంచిది.

Similar News

News October 29, 2025

CSIR-IIIMలో ఉద్యోగాలు

image

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(IIIM)జమ్మూ 4 జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 13వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, మాస్టర్ డిగ్రీ( హిందీ / ఇంగ్లిష్‌) ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iiim.res.in.

News October 29, 2025

LAYOFFS: లక్షల మంది ఉద్యోగుల తొలగింపు!

image

ఇటీవల మల్టీ నేషనల్ కంపెనీల్లోనూ భారీగా లేఆఫ్స్ జరుగుతున్నాయి. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. లేఆఫ్స్ ఇచ్చిన కంపెనీలివే.. UPSలో 48,000, అమెజాన్‌లో 30,000, ఇంటెల్‌లో 24,000, Nestleలో 16,000, యాక్సెంచర్‌లో 11,000, ఫోర్డ్‌లో 11,000, నోవో నార్డిస్క్‌లో 9,000, మైక్రోసాఫ్ట్‌లో 7,000, PwCలో 5,600, సేల్స్‌ఫోర్స్‌లో 4,000 ఉద్యోగాల తొలగింపు వార్తలు వచ్చాయి.

News October 29, 2025

CM చంద్రబాబు ఏరియల్ సర్వే

image

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అమరావతి నుంచి ఆయన హెలికాప్టర్‌లో బయల్దేరారు. వాతావరణం అనుకూలిస్తే అమలాపురంలో దిగి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారని తెలుస్తోంది. వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు ఇప్పటికే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనిపై ఉదయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సమీక్ష కూడా నిర్వహించారు.