News June 27, 2024

సరికొత్త గరిష్ఠాలతో స్టాక్ మార్కెట్లు క్లోజ్

image

ఈరోజు సెషన్‌లో జోరు ప్రదర్శించిన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌ను సరికొత్త గరిష్ఠాలతో ముగించాయి. సెన్సెక్స్ ఓ దశలో 79,396కు చేరగా మార్కెట్ ముగిసే సమయానికి 568 పాయింట్ల లాభంతో 79,243 వద్ద స్థిరపడింది. మరోవైపు 24వేల మార్క్ తాకిన నిఫ్టీ సైతం అదే జోరు కొనసాగించి 175 పాయింట్ల లాభంతో 24,044 వద్ద క్లోజ్ అయింది. ఐటీ, విద్యుత్ రంగాల షేర్లు లాభాల్లో దూసుకెళ్లడం మార్కెట్లకు కలిసొచ్చింది.

Similar News

News October 11, 2024

ప్రభుత్వాసుపత్రుల సిబ్బందిపై మంత్రి ఆగ్రహం

image

AP: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బందిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఆసుపత్రుల్లో పర్యవేక్షణ లోపాన్ని సవరించాలని ఆదేశించారు. ఈ బాధ్యతను వైద్యారోగ్యశాఖ HODలకు అప్పగించారు. పనివేళలు పాటించని సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్నారు. హాజరు నమోదు యాప్‌ను పటిష్టం చేయాలని సూచించారు.

News October 11, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 11, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:08 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:03 గంటలకు
అసర్: సాయంత్రం 4:19 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:57 గంటలకు
ఇష: రాత్రి 7.09 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.