News July 4, 2025
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. sensex 193 పాయింట్ల లాభంతో 83,432 వద్ద స్థిరపడింది. nifty 55 పాయింట్లు లాభపడి 25,461 వద్ద ట్రేడింగ్ ముగించింది. బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ, విప్రో, అల్ట్రాటెక్, రిలయన్స్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, ఇండస్ ఇండ్, అదానీ పోర్ట్స్ M&M షేర్లు నష్టపోయాయి.
Similar News
News July 5, 2025
కుర్రాడు ఇరగదీస్తున్నాడు!

INDతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ యువ బ్యాటర్ జేమీ స్మిత్ అదరగొడుతున్నారు. రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్సులో 207 బంతుల్లోనే 4 సిక్సర్లు, 21 ఫోర్లతో 184 రన్స్ చేశారు. ఎక్కడా తడబడకుండా అటాకింగ్ బ్యాటింగ్‌తో అదుర్స్ అనిపించారు. తొలి టెస్టులో 84 రన్స్ చేశారు. 24 ఏళ్ల స్మిత్ 2019లో ఫస్ట్ క్లాస్ సెంచరీ బాదారు. గతేడాది టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నారు.
News July 5, 2025
పట్టుబిగించిన భారత్.. లీడ్ ఎంతంటే?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఇంగ్లండ్‌ను 407కు ఆలౌట్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 64 రన్స్ చేసింది. ఆట ముగిసే సమయానికి 244 పరుగుల లీడ్‌లో ఉంది. రాహుల్ 28*, కరుణ్ 7* క్రీజులో ఉన్నారు. అంతకుముందు సిరాజ్ 6, ఆకాశ్ 4 వికెట్లతో చెలరేగారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో స్మిత్ 184*, బ్రూక్ 158 రన్స్‌తో అదరగొట్టారు.
News July 4, 2025
PHOTO: గోల్కొండ కోట అందం చూశారా?

హైదరాబాద్‌లోని గోల్కొండ కోట చాలా ఏళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ కోటను ఎప్పుడైనా మీరు ఆకాశంలో నుంచి చూశారా? దీని ఏరియల్ వ్యూకు సంబంధించిన దృశ్యం ఆకట్టుకుంటోంది. పచ్చని చెట్ల నడుమ కోట నిర్మాణం అబ్బురపరుస్తోంది. బోనాల సందర్భంగా ఈ ఫొటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరలవుతోంది.