News February 24, 2025

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 856 పాయింట్ల నష్టంతో 75,454 వద్ద, నిఫ్టీ 242 పాయింట్ల నష్టంతో 22,553 వద్ద ఎండ్ అయ్యాయి. M&M, రెడ్డీస్ ల్యాబ్స్, హీరో మోటో కార్ప్, కొటక్ మహీంద్ర సంస్థల షేర్లు భారీ లాభాలను అందుకున్నాయి. విప్రో, HCL, TCS, ఇన్ఫోసిస్, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

Similar News

News February 24, 2025

ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా

image

AP: ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే టీడీపీకి, పార్టీ పదవులను కూడా వదులుకుంటున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని ప్రకటించారు. కాగా ఫైబర్‌నెట్ ఎండీ, IAS దినేశ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని జీవీ రెడ్డి ఆరోపించారు. దీనిపై జీవీ రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించినట్లు సమాచారం.

News February 24, 2025

స్కూలు విద్యార్థులకు శుభవార్త

image

TG: మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలు, 7-10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 28వ తేదీతో ముగియనున్న గడువు తేదీని మార్చి 10వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. OC విద్యార్థులు రూ.200, SC, ST, BC, PHC, EWS విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 24, 2025

GET READY: రేపు 3.33PM గంటలకు!

image

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ విడుదలకు సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 3.33 గంటలకు టీజర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.

error: Content is protected !!