News April 8, 2025

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1089 పాయింట్ల లాభంతో 74227 వద్ద, నిఫ్టీ 374 పాయింట్ల లాభంతో 22535 వద్ద ముగిశాయి. టారిఫ్స్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లు రాణించాయి. అటు క్రూడాయిల్ రేట్లు తగ్గడం కూడా ఓ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Similar News

News April 17, 2025

IPL: RR ఓటమి.. ఆ బ్యాటర్‌పై ఫ్యాన్స్ ఫైర్!

image

నిన్న DCతో మ్యాచులో RR ఓడిపోవడానికి ఆ జట్టు బ్యాటర్ ధ్రువ్ జురెల్ కారణమని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. 20వ ఓవర్ చివరి 2 బంతుల్లో 3 పరుగులు అవసరం కాగా, జురెల్ రెండో రన్ తీయడానికి నిరాకరించారు. ఆ తర్వాత చివరి బంతికి 1 రన్ మాత్రమే రావడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో DC గెలిచింది. జురెల్ రెండో పరుగు తీసి ఉంటే మ్యాచ్ టై అవ్వకుండా RR గెలిచేదని పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?

News April 17, 2025

ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: ఇవాళ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రతోపాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు నిన్న అనకాపల్లి జిల్లా చీడికాడలో 42.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.

News April 17, 2025

SRH: హెడ్, అభిషేక్‌లపైనే భారమంతా?

image

IPLలో భాగంగా ఇవాళ MIతో SRH ఢీకొననుంది. కాగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రాణిస్తేనే SRH గెలుస్తోంది. లేదంటే ఆ జట్టు గాడి తప్పుతోంది. గణాంకాలను చూస్తే ఇది తేటతెల్లమవుతోంది. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 21 ఇన్నింగ్సులు ఆడారు. ఇందులో గెలిచిన 11 మ్యాచుల్లో 801 రన్స్ కొట్టారు. అదే ఓడిన 10 ఇన్నింగ్సుల్లో 145 పరుగులే చేశారు. గెలిచిన మ్యాచుల్లో జట్టు రన్ రేట్ 14.5 ఉండగా ఓడిన వాటిలో 8.78 మాత్రమే ఉంది.

error: Content is protected !!