News September 1, 2025
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. జీఎస్టీ సంస్కరణలు, జీడీపీ గణాంకాల సెంటిమెంట్‌తో Sensex 554 పాయింట్లు లాభపడి 80,364 వద్ద సెటిల్ అయ్యింది. Nifty 198 పాయింట్ల లాభంతో 24,625 వద్ద స్థిరపడింది. బజాజ్ ఆటో, M&M, టాటా మోటార్స్, హీరో మోటాకార్ప్, ఐచర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడగా, సన్ ఫార్మా, ఐటీసీ, టైటాన్, రిలయన్స్, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి.
Similar News
News September 22, 2025
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు: APSDMA

AP: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
News September 22, 2025
వయసు కాదు.. ధైర్యమే ముఖ్యం!

ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని నిరూపించారు 77 ఏళ్ల రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ సోహన్ రాయ్. పుణేకు చెందిన సోహన్ తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉమ్లింగ్ లాను అధిరోహించి ఔరా అనిపించారు. లద్దాక్‌లోని 19,024 అడుగుల ఎత్తైన ఈ ప్రాంతానికి ఆయన చేసిన ప్రయాణం సాహసానికి, సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఇక్కడి భిన్నమైన వాతావరణంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి.
News September 22, 2025
యూరియాతో తీవ్ర నష్టం: సీఎం

AP: యూరియా ఎక్కువగా వాడటం వల్ల పాలు కూడా కలుషితం అవుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘యూరియా వల్ల ప్రజారోగ్యం, పంట ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. రసాయనాలు, యూరియా అధిక వినియోగంపై రైతుల్ని చైతన్యపర్చాల్సి ఉంది. బాధ్యతలేని నాయకులు ఎరువులు ఇవ్వలేదని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సర్టిఫికేషన్ ఇచ్చిన ఆహారాన్నే తీసుకుంటున్న ఆ నేతలు రైతులను మోసగిస్తున్నారు’ అని అసెంబ్లీలో విమర్శించారు.