News February 12, 2025
Stock Markets: కుప్పకూలాయి..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734703367305_1124-normal-WIFI.webp)
స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 22,862 (-209), సెన్సెక్స్ 75,570 (-730) వద్ద ట్రేడవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ప్రభావంతో గ్లోబల్ సప్లయి చైన్ దెబ్బతింటుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్ముతున్నారు. ఇండియా విక్స్ 2.75% పెరిగి 15.28కి చేరుకుంది. IT షేర్లు రాణిస్తున్నాయి. మీడియా, రియాల్టి, బ్యాంకు, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు విలవిల్లాడుతున్నాయి.
Similar News
News February 12, 2025
ర్యాగింగ్ భూతాలు: మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీసి…
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739344349277_1199-normal-WIFI.webp)
కేరళ కొట్టాయం నర్సింగ్ కాలేజీలో దారుణం జరిగింది. తిరువనంతపురానికి చెందిన ముగ్గురు ఫస్టియర్ స్టూడెంట్స్‌ను ఐదుగురు థర్డ్ ఇయర్ సీనియర్లు ర్యాగింగ్ చేశారు. బట్టలిప్పించి వారి మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీశారు. అక్కడితో ఆగకుండా గాయాలకు కెమికల్స్ పూశారు. నొప్పి భరించలేక అరుస్తుంటే నోట్లోనూ స్ప్రే చేశారు. డబ్బులు దోచుకున్నారు. చంపేస్తామని బెదిరించినా తట్టుకోలేని స్టూడెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 12, 2025
త్వరలో రాజ్యసభకు కమల్ హాసన్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739343504148_1199-normal-WIFI.webp)
మక్కల్ నీది మయ్యమ్ (MNM) అధినేత, సినీ స్టార్ కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. ఆయనతో పాటు మరొకరికీ అవకాశం ఉంటుందని తెలిసింది. 2024 లోక్‌సభ ఎన్నికలప్పుడు అధికార DMKతో MNM పొత్తు పెట్టుకుంది. బదులుగా కమల్‌ను రాజ్యసభకు పంపిస్తామని CM MK స్టాలిన్ హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని నేడు DMK మంత్రి ఒకరు, అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. MNM నుంచి మరొకరికీ అవకాశమిస్తామని పేర్కొన్నారు.
News February 12, 2025
స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం సమీక్ష సమావేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738426758075_81-normal-WIFI.webp)
TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. రిజర్వేషన్లు, ఎన్నికల సన్నాహాలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, ఉత్తమ్, సీఎస్ శాంతికుమారి, కలెక్టర్లు ఇతర అధికారులకు ఆయన వివరించనున్నారు. మరోవైపు ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా నిర్వహించాలని రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించనుంది.