News April 1, 2025
స్టాక్ మార్కెట్స్ క్రాష్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎరుపెక్కాయి. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ఆరంభంలోనే బేర్ పంజా విసిరింది. సెన్సెక్స్ 1160 పాయింట్ల భారీ నష్టంతో 76,220 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 273Pts కోల్పోయి 23,246 వద్ద కొనసాగుతోంది. Bajaj finserv, infosys, HDFC బ్యాంక్, Sriram, Bajaj finance షేర్లు భారీగా పడిపోయాయి.
Similar News
News November 5, 2025
రజినీకాంత్-కమల్ హాసన్ మల్టీస్టారర్!

మరోసారి రజినీకాంత్-కమల్ హాసన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఈ మూవీ ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రజినీ తన తర్వాతి రెండు మూవీస్ కమల్ ప్రొడక్షన్లోనే చేయబోతున్నారట. మొదటిది సుందర్ సి దర్శకత్వంలో, రెండోది నెల్సన్ డైరెక్షన్లో ఈ మల్టీస్టారర్ ఉండబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.
News November 5, 2025
రిహ్యాబిలిటేషన్ సెంటర్లో చేరిన స్టార్ క్రికెటర్

T20 WC ఆఫ్రికా క్వాలిఫయర్స్‌కు స్టార్ బ్యాటర్ షాన్ విలియమ్స్ అందుబాటులో ఉండరని జింబాంబ్వే క్రికెట్ ప్రకటించింది. యాంటీ డోపింగ్, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతని సెంట్రల్ కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయట్లేదని తెలిపింది. అతను డ్రగ్ అడిక్షన్తో ఇబ్బంది పడుతూ రిహ్యాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లినట్లు ఒప్పుకున్నారని తెలిపింది. విలియమ్స్ అన్ని ఫార్మాట్లలో కలిపి 56 హాఫ్ సెంచరీలు, 14 శతకాలు సహా 8968 రన్స్ చేశారు.
News November 5, 2025
గవర్నమెంట్ షట్ డౌన్లో US రికార్డ్

షార్ట్ టర్మ్ గవర్నమెంట్ ఫండింగ్ బిల్లు 14వసారీ US సెనేట్‌లో తిరస్కరణకు గురైంది. 60 ఓట్లు కావాల్సి ఉండగా.. 54-44 తేడాతో బిల్ పాస్ కాలేదు. US చరిత్రలో లాంగెస్ట్ షట్‌డౌన్(35 డేస్)గా రికార్డులకెక్కింది. ఇప్పటికే అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. షట్‌డౌన్ ఆరోవారంలోకి ప్రవేశిస్తే సిబ్బంది కొరత వల్ల కొన్ని ఎయిర్ స్పేస్ సెక్షన్స్ క్లోజ్ కూడా కావొచ్చని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.


