News December 12, 2024
STOCK MARKETS: ఎయిర్టెల్, టీసీఎస్ షేర్లకు డిమాండ్

స్టాక్మార్కెట్లు మోస్తరు లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 24,664 (+24), సెన్సెక్స్ 81,646 (+124) వద్ద ట్రేడవుతున్నాయి. IT, సర్వీస్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు షేర్లకు డిమాండ్ నెలకొంది. మీడియా, టూరిజం, ఆటో, కన్జూమర్ డ్యురబుల్స్, ఎనర్జీ షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. TECHM, AIRTEL, TCS, INDUSIND, WIPRO టాప్ గెయినర్స్. టైటాన్, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, మారుతీ టాప్ లూజర్స్. IND VIX 13కు తగ్గింది.
Similar News
News October 23, 2025
కార్తీక మాసం: ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినకూడదు?

ఉల్లి, వెల్లుల్లి రజో, తమో గుణాల ప్రభావాన్ని పెంచుతాయి. రజో గుణం మనస్సులో కోరికలను పెంచుతుంది. తమో గుణం వల్ల బద్ధకం, అజ్ఞానం ఆవరించే అవకాశాలుంటాయి. ఇది దైవ స్మరణ కోసం కేటాయించిన పవిత్ర సమయం. ఈ సమయంలో పూజలు ఏకాగ్రతతో చేయాలంటే, ఇంద్రియాలను అదుపులో ఉంచాలి. అది జరగాలంటే భగవత్ చింతనకు ఆటంకం కలిగించే ఈ పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక శుద్ధి కోసం వీటిని తినకుండా ఉండటం ఉత్తమం అని సూచిస్తుంటారు.
News October 23, 2025
మెటాలో 600 ఉద్యోగులపై వేటు!

మెటా కంపెనీ AI సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు US మీడియా పేర్కొంది. దీంతో ఫేస్బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ యూనిట్, ప్రొడక్ట్ ఏఐ, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లపై ప్రభావం పడనుంది. కాగా ఈ తొలగింపుతో అనవసర విధులు తగ్గి ఉద్యోగులు శ్రద్ధతో పనిచేస్తారని మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ వాంగ్ తెలిపారు. అయితే కొత్త నియామకాలపై దీని ఎఫెక్ట్ ఉండదని తెలుస్తోంది.
News October 23, 2025
ఓటీటీలోకి వచ్చేసిన ‘OG’

పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ‘OG’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.308 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు.