News February 14, 2025
Stock Markets: ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్

దేశీయ స్టాక్‌మార్కెట్లు మోస్తరు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,082 (+53), సెన్సెక్స్ 76,372 (+242) వద్ద ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడమే ఇందుకు కారణం. మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లకు డిమాండ్ పెరిగింది. HUL, NESTLE, టాటా కన్జూమర్, బ్రిటానియా, ITC టాప్ గెయినర్స్.
Similar News
News November 6, 2025
భారత్ బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

క్వీన్స్‌లాండ్‌లో జరుగుతున్న నాలుగో T20లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
IND: అభిషేక్, గిల్, సూర్య (C), తిలక్, అక్షర్, సుందర్, జితేశ్ శర్మ, దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
AUS: మార్ష్ (C), షార్ట్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, ఫిలిప్, స్టాయినిస్, మ్యాక్స్‌వెల్, డ్వార్షియస్, బార్ట్లెట్, ఇల్లిస్, జంపా.
News November 6, 2025
DANGER: CT స్కాన్ చేయిస్తున్నారా?

ఏదైనా చిన్న సమస్యతో ఆస్పత్రికి వెళ్తే సీటీ స్కాన్, MRIలను వైద్యులు సజెస్ట్ చేస్తుంటారు. అయితే CT స్కాన్ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే మొత్తం క్యాన్సర్ సంఖ్యల్లో CT స్కాన్ క్యాన్సర్లు 5 శాతానికి చేరొచ్చని అమెరికాలో జరిగిన అధ్యయనంలో తెలిసినట్లు పేర్కొన్నారు. CT స్కాన్ల వినియోగం, డోసులు తగ్గించకపోతే ప్రమాదమేనంటున్నారు.
News November 6, 2025
BBL: ఆ బంతులు ప్రేక్షకులకే!

ఆస్ట్రేలియాలో జరిగే BBL, WBBL టోర్నీల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. బ్యాటర్ 6 లేదా 4 కొట్టిన బంతి ప్రేక్షకుల వద్దకు వెళితే దాన్ని వాళ్లు తీసుకెళ్లొచ్చు. అయితే ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌కే ఇది వర్తిస్తుంది. ఆ ఓవర్లో ఎన్నిసార్లు కొట్టినా సరే బంతిని మారుస్తారు. మరోవైపు బాల్‌ను ప్రేక్షకులు తీసుకోకపోయినా రెండో ఓవర్ నుంచి కొత్తది వాడనున్నారు. ఆలస్యం జరగకుండా అంపైర్లు తమ వద్ద కొన్ని ఉంచుకోనున్నారు.


