News January 22, 2025
Stock Markets: ఐటీ షేర్లకు డిమాండ్..

నిన్నటి నష్టాల నుంచి స్టాక్మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 23,112 (+88), సెన్సెక్స్ 76,206 (+371) వద్ద చలిస్తున్నాయి. నిఫ్టీకి 23,000 వద్ద సపోర్టు దొరకడం గమనార్హం. మరోవైపు డాలర్ ఇండెక్స్, బాండ్ యీల్డుల పెరుగుదల కలవరపెడుతున్నాయి. మీడియా, మెటల్, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఐటీ షేర్లు ఫర్వాలేదు.
Similar News
News November 12, 2025
‘తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా చూడండి’

AP: మొంథా తుఫాన్ నష్టంపై వేగంగా నివేదిక ఇచ్చి.. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం CMతో సమావేశమైంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బృంద సభ్యులను సీఎం కోరారు.
News November 12, 2025
SBIలో మేనేజర్ పోస్టులు

<
News November 12, 2025
వేగం వద్దు.. ఇలా కూడా ఆనందపడవచ్చు!

బైక్, కార్లలో వేగంగా ప్రయాణించడం ద్వారా పొందే తాత్కాలిక సంతోషం కంటే, దైవ స్మరణలో నిమగ్నమై ఆ దైవత్వం గొప్పతనాన్ని తెలుసుకుంటే మనిషికి అంతకన్నా ఉన్నత స్థాయి ఉండదు. జీవితంలో నిజమైన ఆనందం ఆ వేగంలో లేదు. పరమాత్మ సృష్టించిన లోకంలోనే ఉంది. కోయిల నాదంలో, కురిసే చినుకులో, పూసే పూవులో, చిన్నపిల్లల మాటల్లో ఆ ఆనందాన్ని అనుభవించాలి. నిస్వార్థంగా ఇతరులకు చేసే సాయంలో లభించే సంతృప్తి ఎంతో గొప్పది.


