News March 13, 2025
Stock Markets: మోస్తరు నష్టాల్లో ముగింపు

స్టాక్‌మార్కెట్లు మోస్తరుగా నష్టపోయాయి. నిఫ్టీ 22,397 (-73), సెన్సెక్స్ 73,828 (-200) వద్ద ముగిశాయి. PSU బ్యాంకు, CPSE షేర్లు రాణించాయి. రియాల్టి, మీడియా, ఆటో, మెటల్, వినియోగం, తయారీ, ఇన్ఫ్రా, ఐటీ, కమోడిటీస్, హెల్త్‌కేర్, ఫార్మా షేర్లు విలవిల్లాడాయి. BEL, SBI, NTPC, సిప్లా, ICICI బ్యాంకు టాప్ గెయినర్స్. శ్రీరామ్ ఫైనాన్స్, హీరోమోటో, టాటా మోటార్స్, HDFC లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంకు టాప్ లూజర్స్.
Similar News
News March 14, 2025
రోహిత్ శర్మపై వరుణ్ ప్రశంసలు

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కెప్టెన్ రోహిత్ శర్మ తనను చక్కగా ఉపయోగించుకున్నారని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చెప్పారు. ‘పవర్ ప్లేలో 2 ఓవర్లు, చివర్లో 2, 3 ఓవర్లు, మిడిల్ ఓవర్లలో వికెట్ కావాల్సినప్పుడు బౌలింగ్ చేస్తాను. ఇదే నా బలం అని రోహిత్ శర్మతో చెప్పాను. ఆయన మరో మాట మాట్లాడకుండా నేను చెప్పింది అర్థం చేసుకున్నారు. రోహిత్ శర్మ ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్లలో ఒకరు’ అని వరుణ్ ఓ ఇంటర్వ్యూలో కొనియాడారు.
News March 14, 2025
‘దిల్‌రూబా’ మూవీ రివ్యూ&రేటింగ్

కిరణ్ అబ్బవరం, రుక్సర్, క్యాథీ డేవిసన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ‘దిల్ రూబా’ మూవీ ప్రీమియర్ షోలు థియేటర్లలో ప్రదర్శించారు. సారీ, థాంక్స్ చెప్పని హీరో చివరికి ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది సినిమా కథ. కిరణ్ నటన, రుక్సర్ క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, విజువల్స్ బాగున్నాయి. పెద్దగా ట్విస్టులు లేకపోగా ఫస్టాఫ్ రొటిన్‌గా సాగుతుంది. లవ్ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్, ఎమోషన్స్ అంతగా కనెక్ట్ కావు.
RATING: 2.25/5.
News March 14, 2025
నాకు మంత్రి పదవి వస్తే వారికే లాభం: రాజగోపాల్ రెడ్డి

TG: తనకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పార్టీ, ప్రజలకే లాభమని మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలిపారు. ‘నిద్రాహారాలు మాని భువనగిరి MP సీటును గెలిపించా. 2018లో నేను INC తరఫున పోటీ చేస్తే BJPకి, ఆ తర్వాత BJP నుంచి బరిలో ఉంటే INCకు డిపాజిట్ రాలేదు. 2023లోనూ INC నుంచి పోటీ చేస్తే BJPకి డిపాజిట్ దక్కలేదు’ అని పేర్కొన్నారు.