News July 19, 2024
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 738 పాయింట్లు నష్టపోయి 80,604, నిఫ్టీ 269 పాయింట్లు నష్టపోయి 24,530 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. టాటా స్టీల్, జేఎస్డబ్య్లూ స్టీల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, టాటామోటార్స్, అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా, విప్రో, అపోలో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోగా.. ఇన్ఫోసిస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి.
Similar News
News January 6, 2026
లోకేశ్‌తో ఐకాన్ స్టార్ సినిమా ఫిక్స్?

అల్లు అర్జున్ మరోసారి తమిళ దర్శకుడితో సినిమా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అట్లీతో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. ఆ షూటింగ్ పూర్తవగానే లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ప్రాజెక్టు ప్రారంభమవుతుందని టాలీవుడ్ టాక్. ఇటీవల లోకేశ్ హైదరాబాద్ వచ్చి ఐకాన్ స్టార్‌ను కలిసి మూవీపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ డైరెక్షన్లో నాలుగో చిత్రం కూడా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.
News January 6, 2026
గోదావరి పుష్కరాలకు సన్నాహాలు.. ఘాట్ల విస్తరణ

TG: 2027 గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. భద్రాచలం, మోతెగడ్డ, పర్ణశాల, చినరావిగూడెంలలో భక్తుల రాక కోసం స్నాన ఘాట్ల విస్తరణ, ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటు, బారికేడింగ్, వాటర్‌ప్రూఫ్ టెంట్లు, మహిళల కోసం ప్రత్యేక వసతులు ప్లాన్ చేస్తున్నారు. 150 మీటర్ల భద్రాచలం ఘాట్‌ను మరో 150 మీటర్లు పెంచనున్నారు. ఇప్పటికే AP ప్రభుత్వం సైతం పుష్కరాలకు సన్నాహాలు చేస్తోంది.
News January 6, 2026
మార్చి 1 నుంచి పట్టణ మహిళలకూ ఇందిరమ్మ చీరలు

TG: ఇందిరమ్మ చీరలను మార్చి 1 నుంచి పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు కూడా అందజేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల్లో సభ్యులైన 67 లక్షల మంది మహిళలకు ఇప్పటికే చీరలు పంపిణీ చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం కోసం మరో 40 లక్షల చీరలను కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.


