News July 3, 2024

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సెషన్‌ను లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 545 పాయింట్ల లాభంతో 79,986 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 162 పాయింట్లు ఎగిసి 24,286కు చేరింది. మెటల్, బ్యాంకింగ్ రంగాలు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. HDFC, యాక్సిస్, ICICI, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్రిటానియా షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా నిలిచాయి. HDFC బ్యాంక్ షేర్ 3శాతం వృద్ధి చెంది ₹1794కు చేరింది. ఇది 52 వారాల గరిష్ఠం.

Similar News

News January 16, 2025

సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ సభ: మహేశ్ కుమార్

image

TG: ఫిబ్రవరి రెండో వారంలోపు సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. రాహుల్ తెలంగాణ టూర్‌, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇవాళ ఆయన ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్నారు. క్యాబినెట్ విస్తరణపై పార్టీ అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని మహేశ్ వెల్లడించారు.

News January 16, 2025

పుష్ప-3 అప్డేట్ చెప్పిన DSP

image

పుష్ప-3 కోసం సుకుమార్ నిరంతరం పనిచేస్తున్నారని DSP వెల్లడించారు. స్టోరీపై రీవర్క్ కూడా జరుగుతోందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘పుష్ప-2లో అల్లు అర్జున్ అద్భుతంగా నటించారు. ప్రతి టెక్నీషియన్ బాగా కష్టపడ్డారు. వర్క్ విషయంలో నేనెప్పుడూ టెన్షన్ పడను. ఒత్తిడికి గురైతే క్రియేటివిటీ ఉండదు. సుకుమార్ విజన్, ఆయన స్టోరీలు మాకు స్ఫూర్తి. రెండు పార్టుల కోసం కష్టపడినట్లుగానే పుష్ప-3 కోసం పనిచేస్తాం’ అని తెలిపారు.

News January 16, 2025

4 కొత్త పథకాలు.. సీఎస్ కీలక ఆదేశాలు

image

TG: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి సమావేశమయ్యారు. ఇప్పటికే విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు అర్హులను గుర్తించి జాబితాలను ఈ నెల 21 నుంచి గ్రామసభల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. GHMCలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 26 నుంచి పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.