News July 10, 2024

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 420 పాయింట్లకుపైగా కోల్పోయి 79,924 వద్ద ముగిసింది. ఓ దశలో ఏకంగా 900 పాయింట్లు నష్టపోయిన సూచీ క్రమంగా కోలుకుంది. మరోవైపు నిఫ్టీ 24,324 (-108) వద్ద స్థిరపడింది. ఆటో, బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్లు నష్టాలను నమోదు చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. M&M, టాటా స్టీల్, టీసీఎస్, హిందాల్కో, HCL టెక్ షేర్లు భారీగా నష్టపోయాయి.

Similar News

News October 15, 2024

భారీ వర్షాలు.. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు

image

AP: రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తిరుపతి-0877-2236007, గూడూరు-8624252807, సూళ్లూరుపేట-8623295345, తిరుపతి RDO-7032157040, శ్రీకాళహస్తి-9966524952 నంబర్లను అందుబాటులో ఉంచారు. అటు పలు జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేస్తున్నారు.

News October 15, 2024

రతన్ టాటా కుక్క బెంగతో చనిపోయిందా..? నిజమిదే!

image

స్వర్గీయ రతన్ టాటాపై బెంగతో ఆయన పెంపుడు శునకం ‘గోవా’ చనిపోయిందంటూ వాట్సాప్‌లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వార్తల్ని ముంబైలో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సుధీర్ కుడాల్కర్ ఖండించారు. ‘రతన్‌కి సన్నిహితుడైన శంతను నాయుడిని అడిగి తెలుసుకున్నాను. గోవా ఆరోగ్యంగా ఉంది. దయచేసి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయకండి’ అని విజ్ఞప్తి చేశారు. కాగా.. లైకుల కోసం ఇంత దిగజారాలా అంటూ ఆ వీడియో క్రియేటర్లపై పలువురు మండిపడుతున్నారు.

News October 15, 2024

మసీదులో ‘జై శ్రీరామ్’ నినాదాలతో మనోభావాలు దెబ్బతినవు: హైకోర్టు

image

మసీదులో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన ఇద్దరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఓ మసీదులో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారన్న ఆరోపణలపై దక్షిణ కన్నడ పోలీసులు గత ఏడాది ఇద్దర్ని అరెస్టు చేశారు. మసీదు బహిరంగ ప్రదేశం కావడం, స్థానికంగా మతసామరస్యంతో ఉంటున్నామని ఫిర్యాదుదారే చెప్పిన నేపథ్యంలో నిందితులు చేసింది క్రిమినల్ నేరం కిందికి రాదని కోర్టు అభిప్రాయపడింది.