News November 18, 2024

STOCK MARKETS: రికవరీ బాట పట్టినా..

image

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆరంభంలో భారీగా పతనమైన సూచీలు మధ్యాహ్నం రికవరీ అయ్యాయి. ఆఖర్లో తగ్గి మోస్తరు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 23,453 (-78), సెన్సెక్స్ 77,339 (-241) వద్ద క్లోజయ్యాయి. IT, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్, O&G షేర్లు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొన్నాయి. మెటల్, FMCG, PSU BANKS, REALTY స్టాక్స్ అదరగొట్టాయి. TCS, DRREDDY, INFY, BPCL, CIPLA టాప్ లూజర్స్.

Similar News

News November 18, 2024

RECORD: ఒకే రోజు 5 లక్షల మంది విమాన ప్రయాణం

image

దేశీయ విమాన రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. నవంబర్ 17న 3,173 విమానాల్లో 5,05,412 మంది ప్రయాణం చేశారు. ఒక రోజులో ఇంత మంది ప్రయాణించడం ఇదే తొలిసారి. అన్ని విమానాల్లో 90 శాతంపైన ఆక్యుపెన్సీ నమోదవగా, పలు కారణాలతో సర్వీసులన్నీ ఆలస్యంగానే నడిచాయి. ఫెస్టివల్, పెళ్లిళ్ల సీజన్ కారణంగానే ఈ ట్రాఫిక్ నమోదైందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే డిమాండ్ వింటర్ అంతా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.

News November 18, 2024

పవన్ కళ్యాణ్‌పై MIM కార్యకర్త ఫిర్యాదు

image

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై MIM కార్యకర్త ‘X’లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారంటూ పవన్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. HYDలో 2దశాబ్దాలుగా మతపరమైన గొడవలు జరగలేదని, పవన్‌ తాజా వ్యాఖ్యలు అవమానకరమని రాసుకొచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సమాధానమిచ్చారు.

News November 18, 2024

GREAT: కంటిచూపు లేకపోయినా గ్రూప్-4 జాబ్

image

ఖమ్మం జిల్లా కారేపల్లి(M) చీమలవారిగూడెంకు చెందిన మానస అంధురాలు. టెన్త్ వరకు గ్రామంలో, అనంతరం ఫ్రెండ్స్ సాయంతో కారేపల్లికి 4KM నడిచి వెళ్లి ఇంటర్, డిగ్రీ చదివారు. ఇంటి వద్దే ప్రిపేరై 2022లో బ్యాంక్ జాబ్ సాధించిన మానస.. సహాయకురాలి చేయూతతో గ్రూప్-4 పరీక్ష రాశారు. తన కృషికి ఫలితాల్లో జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తపన ఉంటే లక్ష్యసాధన కష్టం కాదని మానస నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.