News October 31, 2024
STOCK MARKETS: పండగ రోజూ…
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్సే అందాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 79,739 (-202), ఎన్ఎస్ఈ నిఫ్టీ 24,292 (-48) వద్ద చలిస్తున్నాయి. IT, AUTO, FMCG షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఫార్మా, మీడియా, హెల్త్‌కేర్ షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. TECHM, HCL TECH, TCS, INFY, WIPRO టాప్ లూజర్స్. సిప్లా, LT, ONGC, పవర్‌గ్రిడ్, హీరోమోటో టాప్ గెయినర్స్.
Similar News
News October 31, 2024
రేపు ‘ఉచిత గ్యాస్ సిలిండర్’ ప్రారంభం
AP: రాష్ట్రంలో రేపటి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అర్హులకు అందనున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా గ్యాస్ సిలిండర్ అందజేయనుంది. కాగా ఈనెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యాయి.
News October 31, 2024
IPLతో అత్యధికంగా ఆర్జించింది వీరే
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ IPL ద్వారా ఇప్పటివరకు రూ.194.6 కోట్లు సంపాదించారు. టోర్నీ చరిత్రలో హిట్ మ్యాన్‌దే అత్యధిక ఆర్జన. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ (రూ.188.84 కోట్లు), విరాట్ కోహ్లీ (188.2 కోట్లు), రవీంద్ర జడేజా (125.01 కోట్లు), సునీల్ నరైన్ (113.25 కోట్లు) ఉన్నారు. సురేశ్ రైనా, గౌతమ్ గంభీర్, శిఖర్ ధవన్, దినేశ్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, యువరాజ్ సింగ్ కూడా అత్యధికంగా ఆర్జించారు.
News October 31, 2024
ఆ ఆస్తిని పేద పిల్లలకు పంచాలి: మంత్రి సత్యకుమార్
AP: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తుల సమస్యను ఇద్దరు తోడుదొంగలు అంతర్జాతీయ సమస్యగా మార్చారని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. తనకు రక్షణ కల్పించాలన్న చెల్లి కొత్త నాటకం మాయాబజార్‌ను తలపిస్తోందని ట్వీట్ చేశారు. ‘అక్రమంగా సంపాదించిన వ్యక్తులను సమాజం బహిష్కరించాలి. ఆస్తులను నలుగురు పిల్లలకు కాదు, కోట్లాది పిల్లలకు పంచాలి. అప్పుడే నిజమైన దీపావళి’ అని పేర్కొన్నారు.