News October 21, 2024
STOCK MARKETS: పతనం వైపు పయనం

స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 24,956 వద్ద ఆరంభమైన నిఫ్టీ 24,978 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం 100 పాయింట్ల పతనంతో 24,754 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 169 పాయింట్ల నష్టంతో 81,054 వద్ద చలిస్తోంది. HDFC BANK, TECH M, HDFC LIFE, ASIAN PAINTS, WIPRO టాప్ గెయినర్స్. టాటా కన్జూమర్, KOTAK BANK, BPCL, INDUS IND, AIRTEL టాప్ లూజర్స్.
Similar News
News October 18, 2025
వంటింటి చిట్కాలు

* కిస్మిస్లు నిల్వ చేసే ముందు రెండు స్పూన్ల బియ్యప్పిండిని వాటికి పట్టిస్తే ఎన్ని రోజులైనా అతుక్కోకుండా ఉంటాయి.
* నూనె డబ్బాలు ఎంత తోమినా జిడ్డుగానే ఉంటాయి. అప్పుడు కాస్త క్రిస్టల్ సాల్ట్, డిష్ వాష్ లిక్విడ్ వేసిన నీటిలో డబ్బాను కాసేపు నానబెట్టి స్క్రబ్బర్తో రుద్దాలి. దీంతో జిడ్డంతాపోయి తళతళా మెరుస్తాయి.
* చేపలు శుభ్రం చేసిన తర్వాత శెనగపిండి పట్టించి 5 నిమిషాల తర్వాత కడిగితే నీచు వాసన పోతుంది.
News October 18, 2025
బొప్పాయిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. నివారణ ఇలా

ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా ఆంత్రాక్నోస్ కారణంగా బొప్పాయి చెట్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెద్దవిగా మారి ఆకులకు రంధ్రాలు ఏర్పడి రాలిపోతాయి. వ్యాధి తీవ్రమైతే పండ్లు నాశనమవుతాయి. ఈ లక్షణాలు కనిపించిన ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల మొదట్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి.
News October 18, 2025
పిల్లల ప్రశ్నలను గౌరవించి రిప్లై ఇవ్వండి: వైద్యులు

పిల్లల సృజనాత్మకత పెరగాలంటే వారు ప్రశ్నలు అడగటాన్ని ప్రోత్సహించాలని మానసిక వైద్యుడు శ్రీకాంత్ సూచించారు. ‘ఐదేళ్ల లోపు చిన్నారులు రోజుకు సుమారు 300 ప్రశ్నలు అడుగుతారు. ఇది వారి అపారమైన ఉత్సుకతకు నిదర్శనం. తల్లిదండ్రులు వారి ప్రశ్నలకు ఓపిగ్గా జవాబివ్వడం, తెలియని వాటికి తెలుసుకొని చెప్తా అనడం చాలా ముఖ్యం. ప్రశ్నించడాన్ని అణచివేస్తే వారు స్వతంత్రంగా ఆలోచించే శక్తిని కోల్పోవచ్చు’ అని హెచ్చరించారు.