News February 17, 2025
Stock Markets: హమ్మయ్య.. నష్టాలకు తెర!

ఎట్టకేలకు నష్టాలకు తెరపడింది. స్టాక్మార్కెట్లు నేడు లాభపడ్డాయి. ఉదయం 180 Pts పతనమైన నిఫ్టీ 22,959 (+30), 600 pts కోల్పోయిన సెన్సెక్స్ 75,996 (+57) వద్ద ముగిశాయి. ఫార్మా, హెల్త్కేర్, బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్. M&M, ఎయిర్టెల్, ఇన్ఫీ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ లూజర్స్.
Similar News
News January 20, 2026
మాఘ మాసంలో పెళ్లి చేసుకుంటున్నారా?

మాఘ మాసంలో పెళ్లి చేసుకోవడం ఓ సంప్రదాయమే కాదు. అది దంపతుల జీవితంలో ఓ శుభారంభం కూడా! ఆధ్యాత్మికంగా ఈ మాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉండటం వల్ల, ఈ సమయంలో జరిగే వివాహ బంధానికి దైవబలం మెండుగా లభిస్తుందని నమ్ముతారు. జ్యోతిషం ప్రకారం.. మాఘంలో కుజ, గురు గ్రహాల అనుకూలత వల్ల దంపతుల మధ్య సఖ్యత పెరిగి, వంశాభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి అతిథుల రాకకు సౌకర్యంగా ఉంటుంది.
News January 20, 2026
153 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ (UIIC)లో 153 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ (BE/B.Tech/BSc/B.Com/BBA/BCA) అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21- 28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. ఎంపికైన వారికి స్టైపెండ్ నెలకు రూ.9,000 చెల్లిస్తారు. డిగ్రీలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.uiic.co.in
News January 20, 2026
రాష్ట్రంలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చివరితేదీ

TGSRTCలో 198 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ 114 ఉద్యోగాలను TSLPRB భర్తీ చేస్తోంది. నెలకు పేస్కేల్ రూ.27,080-రూ.81,400 ఉంటుంది. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్ట్ చేస్తారు.
అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు www.tgprb.inలో అందుబాటులో ఉంటాయి.


