News December 16, 2024
STOCK MARKETS: ఎలా మొదలవ్వొచ్చంటే..

స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలై రేంజుబౌండ్లో కదలాడే అవకాశముంది. ఆసియా నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి. జపాన్, తైవాన్ సూచీలు ఎగిశాయి. క్రూడాయిల్ ధరలు తగ్గాయి. US FED, BOE, BOJ ద్రవ్య పరపతి సమీక్షలు, US GDP, IPOపై సూచీల గమనం ఆధారపడి ఉంది. నిఫ్టీ రెసిస్టెన్సీ 24,814, సపోర్టు 24,347 వద్ద ఉన్నాయి. STOCKS 2 WATCH: BIOCON, RIL, GMMP, GE POWER, 63MOONS, LUPIN, AURO PHARMA, JSW ENERGY, JKPAPER, HERO
Similar News
News December 9, 2025
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 5 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంఎస్సీ ( మ్యాథ్స్, స్టాటిస్టిక్స్) నెట్/SLET పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పీజీ స్థాయిలో టీచింగ్ చేసిన అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://uohyd.ac.in/
News December 9, 2025
విడిపోతున్న జంటలు.. పూజారులు ఏం చేశారంటే?

హలసూరు(KA) సోమేశ్వరాలయంలో ప్రేమ, పెద్దల అంగీకారం లేని జంటల పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ పెళ్లి చేసుకున్న జంటల్లో విడాకుల కేసులు విపరీతంగా పెరగడంతో పూజారులు కలత చెందారు. ఈ పవిత్ర స్థలానికి చెడ్డపేరు రావొద్దని పెళ్లిళ్లను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని విడాకుల కేసుల విచారణ సమయంలోనూ పూజారులను కోర్టుకు పిలుస్తున్నారని, అది కూడా ఓ కారణం అని అధికారులు చెబుతున్నారు.
News December 9, 2025
మార్కెట్‌పై Blanket కోసం blinkIt డేంజర్ మూవ్

క్విక్ కామర్స్ మార్కెట్‌పై పాగా వేసేందుకు blinkIt మెడిసిన్ డెలివరీ చేయడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేయకున్నా Order And Approve పద్ధతిలో ఆర్డర్ ప్లేస్ అవుతుంది. కస్టమర్‌కు కాసేపటికి డాక్టర్ అని కాల్ చేసి మెడిసిన్ వివరాలు, అవసరం అడిగి అప్రూవ్ చేస్తున్నారు. జలుబు, జ్వరం మందులే కాదు.. బీపీ, షుగర్, నరాల సమస్యల మెడిసిన్స్ సైతం ఓ కాల్‌తో ఇచ్చేస్తున్నారు.


