News December 10, 2024

Stock Markets: నేడెలా ఓపెనవ్వొచ్చంటే..

image

స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలవ్వొచ్చు. ఆసియా, గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.05% ఎగిసింది. జపాన్, కొరియా సూచీలు స్వల్పంగా పెరిగాయి. నిన్న US సూచీలు నష్టపోవడం గమనార్హం. నిఫ్టీకి 24,682 వద్ద రెసిస్టెన్సీ, 24,587 సపోర్టు ఉన్నాయి. టాటా మోటార్స్, సింజిన్, మెట్రోపొలిస్, BEL, లుపిన్, టైగర్ లాజిస్టిక్స్, NHPC, VI షేర్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

Similar News

News October 28, 2025

మొంథా తుఫాను.. ఈ జిల్లాల్లో రాకపోకలు బంద్

image

AP: మొంథా తుఫాను నేపథ్యంలో కృష్ణా, ఏలూరు, తూ.గో., ప.గో., అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో రాకపోకలను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు రాత్రి 8PM నుంచి రేపు 6AM వరకు ఈ జిల్లాల్లోని నేషనల్ హైవేలతో పాటు అన్ని రోడ్లపై వాహనాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కేవలం మెడికల్ సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించారు.

News October 28, 2025

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

image

TG: హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కూకట్‌పల్లి, మియాపూర్, నిజాంపేట్, అల్వాల్, కాప్రాలో వాన పడుతోంది. రాత్రి 7.30 గంటల్లోపు నగరమంతా వర్షం విస్తరిస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News October 28, 2025

సర్జరీ విజయవంతం.. కోలుకున్న శ్రేయస్!

image

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నారని Cricbuzz తెలిపింది. Spleen(ప్లీహం)కు గాయం కాగా సిడ్నీ వైద్యులు మైనర్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారని చెప్పింది. నిన్ననే ICU నుంచి బయటికొచ్చిన అయ్యర్‌ మరో 5 నుంచి 7 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొంది. ఇదే నిజమైతే అతడు త్వరలో మైదానంలో అడుగుపెట్టే ఛాన్సుంది.