News March 27, 2025
Stock Markets: భారీ లాభాలు..

స్టాక్మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 23,591 (+105), సెన్సెక్స్ 77,606 (+317) వద్ద ముగిశాయి. PSU బ్యాంకు, మీడియా, ఎనర్జీ, చమురు, రియాల్టి, PSE, కమోడిటీస్, ఫైనాన్స్, బ్యాంకు, మెటల్, ఇన్ఫ్రా షేర్లు ఎగిశాయి. ఆటో, ఫార్మా, హెల్త్కేర్ షేర్లు ఎరుపెక్కాయి. హీరోమోటో, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్, అదానీ ఎంటర్ప్రైజెస్, HDFC లైఫ్ టాప్ గెయినర్స్. టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఐచర్ మోటార్స్ టాప్ లూజర్స్.
Similar News
News November 7, 2025
చరిత్ర సృష్టించిన మస్క్.. $1 ట్రిలియన్ ప్యాకేజ్

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. ఆయనకు $1 ట్రిలియన్ (₹88 లక్షల కోట్లు) ప్యాకేజ్ ఇచ్చేందుకు 75% టెస్లా షేర్హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో కార్పొరేట్ రంగంలో అత్యంత ఎక్కువ ప్యాకేజ్ గల CEOగా చరిత్ర సృష్టించారు. అయితే మస్క్ నెల జీతంగా కాకుండా ఆ మొత్తాన్ని వచ్చే పదేళ్లలో స్టాక్స్ రూపంలో పొందుతారు. ప్రస్తుతం 476 బి.డాలర్లతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.
News November 7, 2025
హెక్టారుకు ₹50,000 ఆర్థికసాయం: అచ్చెన్న

AP: రేట్లు లేక నష్టపోయిన ఉల్లి రైతులకు త్వరలోనే హెక్టారుకు ₹50వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల్లో 20,913 మంది రైతులకు ₹104.57 కోట్ల సాయం అందుతుందన్నారు. ధరలు పడిపోయినప్పుడు క్వింటాలుకు ₹1,200 చొప్పున ₹18కోట్ల సరకు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. ఇప్పటికే ₹10 కోట్లు ఇచ్చామని, మరో ₹8కోట్లు త్వరలో చెల్లిస్తామని పేర్కొన్నారు.
News November 7, 2025
SBI అరుదైన ఘనత

మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్ల(రూ.8.8 లక్షల కోట్లు) కంపెనీగా SBI నిలిచింది. ఈ ఘనత సాధించిన ఆరో భారత కంపెనీగా, తొలి ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు సృష్టించింది. నిన్న SBI షేరు జీవితకాల గరిష్ఠం రూ.971.15కు చేరడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ జాబితాలో ఇప్పటి వరకు రిలయన్స్, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, ICICI బ్యాంక్ ఉన్నాయి.


