News June 21, 2024

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 600కుపైగా పాయింట్లు కోల్పోయి కనిష్ఠంగా 76,895కు చేరింది. ప్రస్తుతం 480 పాయింట్ల నష్టంతో 77029 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ సైతం 23,390 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. 120 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం 23448 వద్ద కొనసాగుతోంది. అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, L&T వంటి బడా షేర్లు నష్టాలు నమోదు చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది.

Similar News

News October 8, 2024

10,000 మందితో బతుకమ్మ వేడుకలు: సీఎస్

image

TG: HYDలోని ట్యాంక్ బండ్‌పై 10,000 మంది మహిళలతో ఈనెల 10న సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. వేడుకల ఏర్పాట్లపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఈనెల 10న సా.4కు అమరవీరుల స్మారక కేంద్రం నుండి మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్‌కు చేరుకుంటారని తెలిపారు. బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్క్ నుంచి ప్రత్యేకంగా ఫైర్ వర్క్స్, లేజర్ షో ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.

News October 8, 2024

కాంగ్రెస్ అంద‌రినీ రెచ్చ‌గొట్టింది: మోదీ

image

హ‌రియాణాలో కాంగ్రెస్ అన్ని వ‌ర్గాల్ని రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేసిందని, అయినా ప్ర‌జ‌లు ఆ పార్టీని తిర‌స్క‌రించార‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఆందోళ‌న‌ల పేరుతో రైతుల్ని, యువ‌త‌ను, కులాల పేరుతో పేద‌ల్ని రెచ్చ‌గొట్టి స‌మాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్ర‌య‌త్నం చేసింద‌ని మండిప‌డ్డారు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. విభజన రాజ‌కీయాలు ఇక ఎంత‌మాత్రం సాగవని పేర్కొన్నారు.

News October 8, 2024

పాక్ రికార్డు బద్దలు కొట్టిన టీమ్ ఇండియా

image

అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ మంది ఆటగాళ్లను పరిచయం చేసిన జట్టుగా టీమ్ ఇండియా అవతరించింది. ఇప్పటివరకు భారత్ 117 మంది ఆటగాళ్లను పరిచయం చేసింది. బంగ్లాతో జరిగిన తొలి టీ20లో నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ (116) రికార్డును అధిగమించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (111), శ్రీలంక (108), సౌతాఫ్రికా (107), ఇంగ్లండ్ (104), న్యూజిలాండ్ (103) ఉన్నాయి.