News April 11, 2025
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్లో ఉండటం, టారిఫ్లను 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటనతో మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 1161 పాయింట్ల లాభంతో 75,043 వద్ద, నిఫ్టీ 387 పాయింట్ల లాభంతో 22,786 వద్ద కొనసాగుతున్నాయి. సిప్లా, లూపిన్, అరబిందో షేర్లు లాభాల్లో, TCS, అపోలో హాస్పిటల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Similar News
News April 18, 2025
కమిన్స్ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడా?

SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భార్య బెకీ ఇన్స్టాలో షేర్ చేసిన ఓ ఫొటో చర్చనీయాంశమైంది. ఎయిర్పోర్టులో భర్తతో కలిసి ఫొటో దిగిన ఆమె ‘గుడ్బై ఇండియా’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో కమిన్స్ మిగతా మ్యాచులు ఆడకుండా IPL మధ్యలోనే ఆసీస్ వెళ్లిపోతున్నాడా? అని SRH ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే అతడు భార్యకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మాత్రమే ఎయిర్పోర్టు వెళ్లాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
News April 18, 2025
రేపు దేశవ్యాప్త నిరసనలకు VHP పిలుపు

హింసాత్మక ఘటనల నేపథ్యంలో బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని విశ్వహిందూ పరిషత్(VHP) డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు VHP ప్రెసిడెంట్ ఆలోక్ కుమార్ రేపు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో సంస్థ సభ్యులు, మద్దతుదారులు ధర్నాలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ జిల్లాల మెజిస్ట్రేట్లకు మెమోరాండం సమర్పించాలని సూచించారు.
News April 18, 2025
అందుకే వైసీపీ నుంచి బయటికి వచ్చాను: విజయసాయి రెడ్డి

AP: వైసీపీలో తాను నంబర్ 2గా ఉన్నానని, జగన్కు వెన్నుపోటు పొడిచానని మీడియాలో రాస్తున్నారని ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రాంతీయ పార్టీల్లో నంబర్ 2 స్థానమనేది ఓ మిథ్య. నాయకుడికి నాపై ఓ కోటరీ చాలా అపోహలు కల్పించింది. ఆయన మనసులో నాకు స్థానం లేదని గ్రహించి అవమాన భారం తాళలేక పార్టీని వీడాను. వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే నా స్థానం 2వేలకు పడిపోయింది’ అని పేర్కొన్నారు.