News November 22, 2024

STOCK MARKETS: భారీ లాభాల్లోనే..

image

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడమే ఇందుకు కారణం. నిఫ్టీ 23,458 (+107), సెన్సెక్స్ 77,548 (+390) వద్ద ట్రేడవుతున్నాయి. ఆరంభ లాభాలతో పోలిస్తే కాస్త తగ్గాయి. మీడియా, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. రియాల్టి, PSU బ్యాంక్ షేర్లు పుంజుకున్నాయి. ADANIENT, ADANI PORTS, M&M, AXIS BANK, HEROMOTO టాప్ లూజర్స్.

Similar News

News November 22, 2024

ఆ విష‌యంలో కూట‌మి పార్టీల నేతలు గ‌ప్‌చుప్‌

image

సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల లంచాల‌ వ్య‌వ‌హారంలో అదానీపై అమెరికా దర్యాప్తు సంస్థ‌ల ఆరోప‌ణ‌ల‌పై APలో టీడీపీ, జ‌న‌సేన‌, BJP కూట‌మి మౌనంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే అదానీ నుంచి జ‌గ‌న్ రూ.1,750 కోట్ల లంచాలు తీసుకున్న‌ట్టు కూట‌మి అనుకూల వేదిక‌లు ఈ వ్యవహారంపై పెద్దఎత్తున ప్రచారం చేశాయి. మోదీ-అదానీల మధ్య ఉన్న బంధం వ‌ల్లే కూటమిలోని పార్టీల నేత‌లు ఈ వ్య‌వ‌హారంలో నేరుగా స్పందించ‌డం లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

News November 22, 2024

OTTలోకి కొత్త సినిమా

image

కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ అందించిన స్టోరీతో వచ్చిన మూవీ ‘బఘీరా’. అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం నిన్న ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా కన్నడలో రూ.29 కోట్లు వసూలు చేసింది. తెలుగులో నిరాశపర్చింది.

News November 22, 2024

అదానీ విషయంలో రాహుల్ మాటే.. మా మాట: పీసీసీ చీఫ్

image

TG: అదానీ ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచిస్తుందని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ‘అదానీ విషయంలో రాహుల్ గాంధీ మాటే.. మా మాట. చట్ట వ్యతిరేక వ్యాపారాలను రాష్ట్రంలోకి అనుమతించం. ఆరోపణల్లో ఎవరి పేరు ఉన్నా విచారణ జరపాల్సిందే. స్కిల్ వర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు సీఎం రేవంత్ జేబులోకి పోలేదు. స్కిల్ వర్సిటీకి కేటీఆర్ రూ.50 కోట్లిచ్చినా తీసుకుంటాం’ అని తెలిపారు.