News October 14, 2024

జోష్‌లో స్టాక్ మార్కెట్లు

image

వారం ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు, నిఫ్టీ 72 పాయింట్ల ప్లస్‌లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్ ప్రస్తుతం 81,666 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25,037 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. JSW స్టీల్, L&T, టాటా స్టీల్, HDFC, అదానీ పోర్ట్స్, రిలయన్స్, NTPC తదితర షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లు పడిపోయాయి.

Similar News

News October 27, 2025

రెండో దశలో 12 చోట్ల SIR నిర్వహణ: CEC

image

తొలి దశ SIR(సమగ్ర ఓటర్ జాబితా సవరణ) బిహార్‌లో విజయవంతమైనట్లు CEC జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. రెండో దశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 1951-2004 మధ్య కాలంలో 8 సార్లు SIR జరిగినట్లు వెల్లడించారు. చివరగా 21 ఏళ్ల క్రితం ఈ ప్రక్రియ నిర్వహించినట్లు పేర్కొన్నారు. నకిలీ ఓటర్లను అరికట్టి, అసలైన ఓటర్లను గుర్తించేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.

News October 27, 2025

తుఫాను.. ఈ విషయం గుర్తుంచుకోండి!

image

AP: మొంథా తుఫాను ప్రభావంతో తీరప్రాంత జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తుఫాను సమయంలో ఒక్కసారిగా వర్షాలు ఆగి, భీకర గాలులు తగ్గి, ఆకాశం ప్రశాంతంగా ఉంటే సైక్లోన్ ఎఫెక్ట్ ముగిసిందని భావించవద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. అది తుఫాను మధ్యలో విరామం లాంటిదని, కాసేపటికి విరుచుకుపడుతుందని చెబుతున్నారు. గతంలో విశాఖలో హుద్-హుద్ తుఫాను సమయంలోనూ ఇలాగే జరిగిందని గుర్తు చేస్తున్నారు.

News October 27, 2025

సిస్టర్స్ డీప్‌ఫేక్ వీడియోలతో బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్య

image

సైబర్ నేరగాళ్ల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫరీదాబాద్(Haryana)కు చెందిన రాహుల్(19)కు తన ముగ్గురు అక్కల మార్ఫింగ్ చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోలను సైబర్ నేరగాళ్లు పంపారు. డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఫొటోలను SMలో పెడతామని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురై రాహుల్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాహిల్‌‌పై కేసు నమోదైంది. రాహుల్ ఫ్రెండ్ నీరజ్‌‌పైనా అనుమానాలున్నాయి.