News February 4, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 517 పాయింట్ల లాభంతో 77,704 వద్ద, నిఫ్టీ 154 పాయింట్లు లాభపడి 23,511 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.2గా ఉంది.
Similar News
News January 22, 2026
ఘోర ప్రమాదం.. బస్సు, లారీ దగ్ధం

AP: నంద్యాల(D) సిరివెల్లమెట్ట వద్ద ప్రైవేటు బస్సుకు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి HYD వెళ్తున్న ప్రైవేటు బస్సు టైర్ పేలడంతో డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ చనిపోయారు. వెంటనే మంటలు అంటుకోగా ఓ DCM డ్రైవర్ బస్సు అద్దాలు పగలగొట్టడంతో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు, లారీ పూర్తిగా కాలిపోయాయి. క్షతగాత్రులను నంద్యాల ఆస్పత్రికి తరలించారు.
News January 22, 2026
తెలుగు రాష్ట్రాల్లో సరస్వతీ దేవి ఆలయాలు

వసంత పంచమి నాడు తెలుగు రాష్ట్రాల్లోని సరస్వతీ క్షేత్రాలు భక్తజనంతో పోటెత్తుతాయి. TGలోని నిర్మల్ జిల్లాలో బాసర జ్ఞాన సరస్వతి ఆలయం అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి. సిద్దిపేట(D) వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రం కూడా ఎంతో విశిష్టమైనది. APలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు పండుగ రోజు సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తారు. మెదక్(D) ముక్తేశ్వర క్షేత్రం, అనంతపురం(D) హేమావతి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేస్తారు.
News January 22, 2026
చిరంజీవి మూవీ టికెట్ రేట్లు తగ్గింపు

AP: చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ టికెట్ రేట్స్ తగ్గాయి. ప్రభుత్వం తొలి 10రోజులు మల్టీప్లెక్సుల్లో రూ.120, సింగిల్ స్క్రీన్స్లో రూ.100 పెంచుకునే అనుమతి ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో సాధారణ రేట్లకే టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. TGలోనూ టికెట్స్ నార్మల్ రేట్లకే అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్గా రూ.300+ కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.


