News February 7, 2025

Stock Markets: ఫ్లాటుగా సూచీలు.. లాభాల్లో మెటల్ స్టాక్స్

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, RBI వడ్డీరేట్ల సమీక్ష నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 23,586 (-17), సెన్సెక్స్ 78,035 (-22) వద్ద చలిస్తున్నాయి. FMCG, IT, O&G, మీడియా సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, మెటల్ స్టాక్స్ పుంజుకున్నాయి. ఎయిర్‌టెల్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, JSW స్టీల్, అల్ట్రాటెక్ సెమ్ టాప్ గెయినర్స్.

Similar News

News February 7, 2025

సెలవు ఇవ్వలేదని…

image

ఆఫీస్‌లో సెలవు ఇవ్వలేదని నలుగురు సహోద్యోగులను పొడిచిన ఘటన బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగింది. అమిత్ కుమార్ సర్కార్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నిన్న అతడు లీవ్ కోసం అప్లై చేయగా రిజెక్ట్ అయింది. ఈ విషయంపైనే తోటి ఉద్యోగులతో వాగ్వాదానికి దిగిన అతడు కత్తితో నలుగురిపై దాడి చేశాడు. అనంతరం కత్తి, రక్తం మరకలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

News February 7, 2025

ఆపరేషన్ టైగర్: శిండే గూటికి ఠాక్రే ఎంపీలు!

image

మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ హాట్‌టాపిక్‌గా మారింది. ఉద్ధవ్ ఠాక్రే SSUBT 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిండే శివసేనలో చేరబోతున్నారని సమాచారం. ఇప్పటికే చర్చలు ముగిశాయని, వచ్చే పార్లమెంటు సెషన్‌లోపు వీరు చేరడం ఖాయమేనని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో NDA అధికారంలో ఉండటం, ఐదేళ్ల వరకు నిధులు లేకుండా మనుగడ కష్టమవ్వడమే ఇందుకు కారణాలని టాక్. 2/3 వంతు MP/MLAలు మారితే పార్టీ మార్పు నిరోధక చట్టం వర్తించదు.

News February 7, 2025

టాటా ఆస్తిలో రూ.500 కోట్లు.. ఎవరీ మోహన్ దత్తా?

image

వ్యాపార దిగ్గజం రతన్ టాటా తన వీలునామాలో రూ.500 కోట్లు మోహినీ మోహన్ దత్తా అనే వ్యక్తికి రాశారు. ఆ పేరు తాజాగా బయటికి రావడంతో ఆయన ఎవరన్న ఆసక్తి నెలకొంది. ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన దత్తా ఒకప్పుడు స్టాలియన్ అనే ట్రావెల్ ఏజెన్సీకి యజమాని. దాన్ని టాటా గ్రూప్‌లో కలిపేశారు. టాటాతో మోహన్‌కు 60 ఏళ్ల స్నేహముందని జంషెడ్‌పూర్‌వాసులు చెబుతుంటారు. ఆ స్నేహంతోనే భారీ మొత్తాన్ని ఇచ్చారని తెలుస్తోంది.

error: Content is protected !!