News February 7, 2025
Stock Markets: పుంజుకొని మళ్లీ పడిపోయిన సూచీలు

నేడు బెంచ్మార్క్ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,559 (-43), సెన్సెక్స్ 77,860 (-197) వద్ద ముగిశాయి. రెపోరేటు తగ్గించడంతో పుంజుకున్న సూచీలు మధ్యాహ్నం ఇంట్రాడే కనిష్ఠానికి చేరాయి. ఆఖర్లో కాస్త పెరిగి నష్టాలను తగ్గించుకున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, FMCG, O&G షేర్లు పడిపోయాయి. మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆటో షేర్లు ఎగిశాయి. టాటాస్టీల్, ITC హోటల్స్, AIRTEL, JSW స్టీల్, TRENT టాప్ గెయినర్స్.
Similar News
News January 9, 2026
ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయ్!

AP: రోడ్డు, రైలు మార్గాలకు ప్రత్యామ్నాయంగా ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరులోని మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ వీటిని అభివృద్ధి చేసింది. ఈ సంస్థ ఎండీ అభిరామ్ నేతృత్వంలో రూపొందించిన ఈ ట్యాక్సీలు అన్ని భద్రతా పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిని డిజైన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే రెండేళ్లలో సేవలు ప్రారంభం కానున్నాయి.
News January 9, 2026
‘జన నాయకుడు’ వివాదం.. నేడు కోర్టులో విచారణ

విజయ్ ‘జన నాయకుడు’ విడుదలపై మద్రాసు హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC) సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఇవాళ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. సెన్సార్ బోర్డు తీరుపై మేకర్స్ HCని ఆశ్రయించారు. తమ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని కోరారు. న్యాయస్థానం తీర్పుపై విజయ్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుందో లేదో చూడాలి.
News January 9, 2026
ఖరీఫ్, రబీకి అనుకూలం.. APHB 126 సజ్జ రకం

ఏపీలోని అనంతపురం వ్యవసాయ పరిశోధనా కేంద్రం APHB 126 సజ్జ రకాన్ని అభివృద్ధి చేసింది. ఈ రకం పంట కాలం 84 నుంచి 86 రోజులు. ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేయడానికి ఇది అనుకూలమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ సజ్జరకంలో ఇనుము, జింకు అధికంగా ఉంటాయని తెలిపారు. హెక్టారుకు 30 నుంచి 33 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల దీన్ని విడుదల చేశారు.


