News January 22, 2025
Stock Markets: రిలీఫ్ ర్యాలీతో ఇన్వెస్టర్లు ఖుష్..

స్టాక్‌మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, విలువైన షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. నిఫ్టీ 23,155 (+130), సెన్సెక్స్ 76,404 (+566) వద్ద క్లోజయ్యాయి. IT, ఫార్మా, హెల్త్‌కేర్, ఫైనాన్స్ షేర్లు పుంజుకున్నాయి. రియాల్టి షేర్లు రక్తమోడాయి. విప్రో, ఇన్ఫీ, టీసీఎస్, టెక్ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు టాప్ గెయినర్స్.
Similar News
News February 3, 2026
ట్రంప్ డీల్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అమెరికా అధ్యక్షుడు <<19035036>>ట్రంప్ డీల్<<>> ప్రకటనతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగు తీస్తున్నాయి. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 2300 పాయింట్లకు పైగా లాభపడి 84,015 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 734 పాయింట్ల లాభంతో 25,822 వద్ద కొనసాగుతోంది. BSEలోని అన్ని సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.
News February 3, 2026
ఐరన్ లోపం ఉంటే ఏం తినాలంటే?

ఐరన్ లోపంతో గుండె, బ్రెయిన్, కిడ్నీ, లివర్‌పై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే నువ్వులు, ఖర్జూరం, కిస్మిస్, బీట్రూట్, క్యారెట్, మునగాకు, పాలకూర, ఆకుపచ్చ కూరగాయలు, బ్రొకొలీ, పిస్తా, బాదంపప్పు, మటన్ లివర్, పల్లీలు, యాప్రికాట్స్, కోడిగుడ్లు, అవకాడో, కొత్తిమీర, బాదం, జీడిపప్పు, జామ, దానిమ్మ, స్ట్రాబెర్రీ, ఉల్లి, ముల్లంగి, టమాట ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
News February 3, 2026
ఏపీలో ఎక్కువ సాగవుతున్న ఆయిల్ పామ్ రకాలు

☛ కోస్టారికా: ఏపీలో ఎక్కువగా సాగవుతున్న ఆయిల్ పామ్ రకం ఇది. ఈ చెట్లు చాలా పొడవుగా పెరుగుతాయి. గెలల పరిమాణం పెద్దగా వస్తాయి. ఎక్కువ బరువు ఉంటాయి. ☛ సిరాడ్ షార్ట్: ఈ రకం మొక్క మట్టలు తక్కువ సైజులో వస్తాయి. ఈ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగవు. గెలల సంఖ్య ఎక్కువ. గెలల బరువు తక్కువ బరువు ఉన్నా.. ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల రైతులు ఈ రకం సాగుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.


