News January 13, 2025
Stock Markets: పండగ మురిపెం లేనట్టేనా!
స్టాక్‌మార్కెట్లు నేడు నెగటివ్ జోన్లో చలించొచ్చు. US జాబ్‌డేటా మెరుగ్గా ఉండటంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. ఫెడ్ వడ్డీరేట్లను కత్తిరించే అవకాశం లేకపోవడం ప్రతికూలంగా మారింది. US ట్రెజరీ యీల్డులు, డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరలు పెరగడం ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. జీవితకాల గరిష్ఠం నుంచి 11% మేర పతనమైన నిఫ్టీ 23,350 సపోర్టును మళ్లీ బ్రేక్ చేస్తే బేర్స్ విరుచుకుపడతాయని నిపుణుల అంచనా.
Similar News
News January 13, 2025
ట్రంప్‌కు జగ్మీత్ సింగ్ వార్నింగ్
కెనడాను అమెరికాలో భాగం చేసుకోవాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్‌కు న్యూ డెమోక్రటిక్ పార్టీ (NDP) లీడర్ జగ్మీత్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘మా దేశం అమ్మకానికి లేదు. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ స్వతంత్రంగానే ఉంటాం. ఒకవేళ మాతో ఫైట్ చేయాలనుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మా దేశంపై ట్రంప్ టారిఫ్స్ వేస్తే మేమూ అదే పని చేస్తాం’ అని హెచ్చరించారు. కాగా మాజీ PM ట్రూడోకు NDP గతంలో మిత్రపక్షంగా ఉండేది.
News January 13, 2025
ఆన్లైన్లో ‘డాకు మహారాజ్’ HD ప్రింట్!
బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా విడుదలైన రోజునే ఆన్లైన్లో దర్శనమిచ్చింది. పైరసీ సైట్లలో HD ప్రింట్ రావడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. ఇటీవల రిలీజైన ‘గేమ్ ఛేంజర్’ మూవీని కూడా విడుదలైన రోజునే ఆన్లైన్లో పెట్టేశారు. అంతేకాకుండా బస్సులో సినిమాను ప్రదర్శించిన వీడియో సైతం వైరల్ అయింది. ఇలా సినిమాలను లీక్ చేయడం వల్ల నిర్మాతలు నష్టపోతారని, పైరసీని ఆపాలని పలువురు సినీ పరిశ్రమ అభిమానులు కోరుతున్నారు.
News January 13, 2025
హిస్టరీలో ఫస్ట్‌టైమ్: 23 పైసలు తగ్గి 86.27కు రూపాయి
డాలర్ పంచ్‌లకు రూపాయి విలవిల్లాడుతోంది. సోమవారం ఓపెనింగ్ ట్రేడ్‌లో సరికొత్త జీవితకాల కనిష్ఠాన్ని తాకింది. ఏకంగా 23 పైసలు బలహీనపడి చరిత్రలో తొలిసారి 86.27కు చేరుకుంది. డాలరుతో పోలిస్తే శుక్రవారం 14 పైసలు తగ్గి 86 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ ఏదో చేస్తాడన్న విశ్వాసం, డాలర్ ఇండెక్స్, ట్రెజరీ, బాండ్ యీల్డుల పెరుగుదల, FIIలు వెళ్లిపోవడమే ఇందుకు కారణాలు.