News April 7, 2025
STOCK MARKETS: రూ.19 లక్షల కోట్ల నష్టం!

భారత స్టాక్ మార్కెట్స్ సెషన్ ప్రారంభంలోనే సుమారు రూ.19 లక్షల కోట్లు కోల్పోయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ 3939, నిఫ్టీ 1160 పాయింట్ల మేర నష్టాలతో ప్రారంభమయ్యాయి. 2020 మార్చి తర్వాత ఇదే అత్యల్పం. మొత్తంగా 5 శాతానికి పైగా సంపద ఆవిరైంది. ఐటీ, మెటల్ సూచీలు 7 శాతం నష్టపోయాయి. మరోవైపు చైనా, జపాన్, కొరియా తదితర దేశాల మార్కెట్లు సైతం కుప్పకూలాయి.
Similar News
News January 29, 2026
నాపై తప్పుడు ప్రచారం చేశారు: శశి థరూర్

పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న MP శశి థరూర్ ఎట్టకేలకు INC చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో వారిద్దరిని కలిశారు. సానుకూల, నిర్మాణాత్మక చర్చలు జరిగాయని అనంతరం థరూర్ మీడియాకు చెప్పారు. ‘అంతా బాగానే ఉంది. మేమంతా ఒకే మాట మీద ఉన్నాం. నేను ఎప్పుడూ పార్టీ కోసమే పనిచేశాను. ఏనాడూ పదవులు అడగలేదు. నాపై తప్పుడు ప్రచారం చేశారు’ అని అన్నారు.
News January 29, 2026
మున్సిపల్ ఛైర్మన్ పోస్టు ఖరీదు రూ.3కోట్లు?

TG: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల కన్నా ముందే ఛైర్మన్ పదవి కోసం ఆశావహులు పోటీపడుతున్నారు. MLAలు, సీనియర్ నేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఎన్నికలలో పార్టీ ఖర్చులను పూర్తిగా భరిస్తామని, ఛైర్మన్ పదవిని తమకే ఇవ్వాలని విన్నవిస్తున్నారు. రూ.3 కోట్ల వరకు చెల్లించడానికి కూడా రెడీ అవుతున్నారు. కొన్ని చోట్ల ఆమేరకు ఒప్పందాలూ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో FEB 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.
News January 29, 2026
మేడారం జాతర.. రేపు మరో జిల్లాలో సెలవు

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా రేపు మహబూబాబాద్ జిల్లాలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ములుగు జిల్లాలోనూ రేపు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రవ్యాప్తంగా సెలవు ఇవ్వాలని విశ్వహిందూ పరిషత్‌తో పాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


