News November 7, 2024
STOCK MARKETS: రూ.3.5లక్షల కోట్ల నష్టం
స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. US FED వడ్డీరేట్ల కోతపై నిర్ణయం, US బాండ్ యీల్డుల పెరుగుదల, డాలర్ బలపడటం, FIIల పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 79,638 (-739), నిఫ్టీ 24,218 (-265) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.3.5లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. హిందాల్కో 8%, ట్రెంట్, గ్రాసిమ్ 3%, Adanient, TechM 2.5% మేర నష్టపోయాయి.
Similar News
News November 7, 2024
CSK అలా చేయకూడదు: ఊతప్ప
NZ క్రికెటర్ రచిన్ రవీంద్రను CSK అకాడమీలో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతించడం కరెక్ట్ కాదని మాజీ క్రికెటర్ ఊతప్ప అభిప్రాయపడ్డారు. ‘ప్రాంచైజీలు దేశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. మన జట్టుకు ప్రత్యర్థిగా ఆడే విదేశీ ప్లేయర్లకు ఇక్కడ ప్రాక్టీస్ చేసే అవకాశం ఇవ్వొద్దు’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడారు. IPLలేని సమయంలోనూ రచిన్ చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల INDతో టెస్టుల్లో బ్యాట్‌తో రాణించారు.
News November 7, 2024
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సెల్లర్స్‌పై ED దాడులు
FEMA ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ED దేశవ్యాప్తంగా ఒకే సారి సోదాలు నిర్వహిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇ-కామర్స్ సెల్లర్స్ కేంద్రాలు, ఇళ్లలో దాడులు చేపట్టింది. ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, బెంగళూరులో సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు అధికార వర్గాల సమాచారం. సెల్లర్స్‌లో కొందరు విదేశాలకు అక్రమంగా నగదు పంపినట్టు ED అనుమానిస్తోందని తెలిసింది. దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 7, 2024
సమగ్ర సర్వే దేని కోసమో ప్రభుత్వం చెప్పాలి: DK అరుణ
TG: ప్రభుత్వం చేస్తోన్న సమగ్ర కుటుంబ సర్వే దేని కోసమో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని BJP MP డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నావళి కులగణనకు విరుద్ధంగా ఉందన్నారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అనే విషయాలు అడుగుతున్నారని, అవన్నీ ప్రభుత్వానికి ఎందుకు చెప్పాలని ఆమె ప్రశ్నించారు.