News March 21, 2025

Stock Markets: మీడియా, PSE షేర్ల దూకుడు

image

స్టాక్‌మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 23,350 (+159), సెన్సెక్స్ 76,905 (+557) వద్ద ముగిశాయి. మీడియా, PSE, చమురు, CPSE, ఎనర్జీ, PSU బ్యాంకు, హెల్త్‌కేర్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, ఇన్ఫ్రా, కమోడిటీస్, ఫైనాన్స్, బ్యాంకు, రియాల్టి, ఆటో షేర్లు అదరగొట్టాయి. మెటల్, వినియోగ షేర్లు ఎరుపెక్కాయి. SBI లైఫ్, ONGC, NTPC, BPCL, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్. ట్రెంట్, ఇన్ఫీ, విప్రో, హిందాల్కో టాప్ లూజర్స్.

Similar News

News January 18, 2026

అల్లిపూడి హత్య కేసు.. YCP నేతపై కేసు

image

కోటనందూరు మండలం అల్లిపూడి హత్యోదంతంపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు SI రామకృష్ణ తెలిపారు. ప్రధాన నిందితుడు (A1)గా YCP మండల అధ్యక్షుడు చింతకాయల చినబాబుపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండటంతో పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

News January 18, 2026

నేడు ఈ పనులు చేస్తే కష్టాలు తప్పవు: పండితులు

image

చొల్లంగి అమావాస్య పర్వదినాన మనసును, శరీరాన్ని నిర్మలంగా ఉంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య తిథి ముగిసే వరకు మద్యం, మాంసాహారాలకు దూరం ఉండాలని అంటున్నారు. ‘ఇది పితృదేవతలు మన ఇంటికి వచ్చే సమయం కావున ఎవర్నీ దూషించకూడదు. ఇంట్లో గొడవలు పడకూడదు. శుభకార్యాల చర్చలు, కొత్త వస్తువుల కొనుగోలు చేయకపోవడం ఉత్తమం. గోర్లు, జుట్టు కత్తిరించొద్దు. దైవ చింతనలో గడపాలి’ అని వారి సూచన.

News January 18, 2026

గర్భిణులు పారాసిటామాల్ వాడొచ్చు!

image

గర్భిణులు పారాసిటామాల్ ట్యాబ్లెట్ వాడొచ్చని లాన్సెట్ తాజా నివేదిక వెల్లడించింది. దీని వల్ల పుట్టే పిల్లలకు ఆటిజం రాదని, మెదడు ఎదుగుదలపై ఎఫెక్ట్ ఉండదని పేర్కొంది. స్వీడన్, జపాన్‌కు చెందిన 26లక్షల మంది పిల్లల డేటాను విశ్లేషించిన సైంటిస్టులు పారాసిటామాల్ వాడకంపై స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఈ ట్యాబ్లెట్ వల్ల పిల్లలకు ముప్పు అని SMలో ప్రచారం జరిగింది. అటు గర్భిణులకు ఉన్న అనుమానాలనూ ఈ నివేదిక తొలగించింది.