News October 22, 2024
STOCK MARKETS: మిడ్, స్మాల్ షేర్లు క్రాష్

బెంచ్మార్క్ సూచీలు ఫ్లాట్గా చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిక్స్డ్ సిగ్నల్స్ అందాయి. నెగటివ్ సెంటిమెంటు వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 81,133 (-24), నిఫ్టీ 24,770 (-10) వద్ద ట్రేడవుతున్నాయి. స్మాల్, మిడ్క్యాప్ షేర్లు క్రాష్ అవుతున్నాయి. రియల్టీ, మీడియా, మెటల్ రంగాలపై సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. టాటా స్టీల్, టాటా మోటార్స్, M&M, మారుతీ టాప్ లూజర్స్.
Similar News
News November 15, 2025
నిర్మాణాత్మక సంస్కరణలకు సిద్ధం: మంత్రి లోకేశ్

AP: ఏఐ మానవాళికి ముప్పుకాదని, అది హ్యుమానిటీని పెంచుతుందని మంత్రి లోకేశ్ చెప్పారు. CII సదస్సులో ‘AI-భవిష్యత్తులో ఉద్యోగాలు’ అంశంపై ఆయన మాట్లాడారు. ‘ప్రతి పారిశ్రామిక విప్లవం అధిక ఉద్యోగాలను కల్పిస్తుందికానీ తొలగించదు. IT, ఫుడ్ ప్రాసెసింగ్లో పారిశ్రామికవేత్తలు పురోగతి సాధిస్తున్నారు. వీరితో పనిచేసేందుకు ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది. నిర్మాణాత్మక సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధం’ అని పేర్కొన్నారు.
News November 15, 2025
ఇకనైనా ‘వలస’ జీవులకు విముక్తి లభించేనా?

బిహార్లో మరోసారి ఎన్డీఏ తమ ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందుతున్న లక్షలాది మంది తిరిగి తమ ఉపాధి క్షేత్రాలకు తిరిగిరానున్నారు. ఈక్రమంలో ఏళ్లు గడుస్తున్నా వలస జీవుల బతుకులు మారట్లేదని, ప్రజలకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. స్థిరమైన ప్రభుత్వం రావడంతో ఇకనైనా కంపెనీలు నెలకొల్పి స్థానికంగా ఉపాధి కల్పించాలని సూచిస్తున్నారు.
News November 15, 2025
APPLY NOW: RRUలో 9 పోస్టులు

గుజరాత్లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ<


