News October 16, 2024
STOCK MARKETS: మిక్స్డ్ సిగ్నల్స్.. ఫ్లాట్ ఓపెనింగ్

ఆసియా మార్కెట్ల నుంచి మిక్స్డ్ సిగ్నల్స్ రావడం, కంపెనీల ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో దేశీయ బెంచ్మార్క్ సూచీలు నేడు ఫ్లాట్గా మొదలయ్యాయి. నిఫ్టీ 25,067 (10), సెన్సెక్స్ 81,834 (13) వద్ద ట్రేడవుతున్నాయి. NSEలో 73 స్టాక్స్ 52WEEK గరిష్ఠాన్ని తాకాయి. HDFC లైఫ్, హిందాల్కో, ఏషియన్ పెయింట్స్, SBI లైఫ్, HDFC బ్యాంక్ టాప్ గెయినర్స్. M&M, నెస్లే, ట్రెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐచర్ మోటార్స్ టాప్ లూజర్స్.
Similar News
News November 14, 2025
ఐపీఎల్-2026 మినీ వేలం డేట్ ఫిక్స్!

ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబీలో జరగనున్నట్లు ESPN తెలిపింది. వరుసగా మూడో ఏడాది విదేశాల్లోనే ఆక్షన్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎప్పటిలాగే రోజు మొత్తం వేలం సాగే అవకాశముంది. ఈసారి అన్ని జట్లు పెద్ద మొత్తంలో ప్లేయర్లను వదులుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేలం ఆసక్తిగా మారనుంది. మరోవైపు పలు జట్లు ఆటగాళ్లను ట్రేడ్ చేసుకుంటున్నాయి.
News November 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 14, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 14, 2025
‘జూబ్లీహిల్స్’ ప్రస్థానమిదే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి మాగంటి గోపినాథ్(టీడీపీ, బీఆర్ఎస్) వరుసగా మూడు సార్లు గెలిచారు. ఈ ఏడాది జూన్లో ఆయన అనారోగ్యంతో చనిపోగా ఈ నెల 11న ఉపఎన్నిక జరిగింది. ఇవాళ ఓట్ల లెక్కింపు జరగనుంది.


