News March 17, 2025
Stock Markets: నిఫ్టీ 150+, సెన్సెక్స్ 450+ అప్

ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 22,549 (+153), సెన్సెక్స్ 74,275 (+470) వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా, హెల్త్‌కేర్, ఆటో, మెటల్, ఎనర్జీ, PSE, CPSE, వినియోగం, చమురు, బ్యాంకు షేర్లకు గిరాకీ ఉంది. మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు ఎగిశాయి. ఇండస్‌ఇండ్, బజాజ్ ట్విన్స్, SBI లైఫ్, Dr రెడ్డీస్ టాప్ గెయినర్స్. నెస్లే, BPCL టాప్ లూజర్స్.
Similar News
News March 17, 2025
బైడెన్ క్షమాభిక్ష నిర్ణయాలు రద్దు: ట్రంప్

US అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు జో బైడెన్ తన సోదరులు, సోదరితో పాటు పలువురికి ప్రసాదించిన క్షమాభిక్షలు చెల్లవని ట్రంప్ ప్రకటించారు. ఆ ఆదేశాలపై బైడెన్ ఆటోపెన్‌తో సంతకాలు చేశారని, ఆయనకు తెలియకుండా కొందరు ఆ వ్యవహారాన్ని నడిపారన్నారు. ఈ నేరానికి పాల్పడిన వారే తనపై రెండేళ్లపాటు జరిగిన తప్పుడు దర్యాప్తుకు సంబంధించిన ఆధారాలను నాశనం చేశారని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు.
News March 17, 2025
భాషపై లేనిపోని రాజకీయాలు చేయం: CBN

AP: భాష కమ్యూనికేషన్ కోసమే అని, దాంతో విజ్ఞానం రాదని CM చంద్రబాబు అన్నారు. ‘మాతృభాషతోనే విజ్ఞానం వస్తుంది. భాషపై లేనిపోని రాజకీయాలు చేయం. బతుకుదెరువుకు ఎన్ని భాషలైనా నేర్చుకుంటాం. కానీ మాతృభాషను మరిచిపోకూడదు’ అని తెలిపారు. మరోవైపు, ధ్వంసమైన రాష్ట్రాన్ని ట్రాక్‌లో పెట్టామన్నారు. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాయలసీమను రతనాలసీమగా మార్చడం ఖాయమని వివరించారు.
News March 17, 2025
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయను: హర్ష సాయి

ఇకపై బెట్టింగ్ యాప్స్‌ను తాను ప్రమోట్ చేయనని ప్రముఖ యూట్యూబర్ <<15777784>>హర్షసాయి<<>> అన్నారు. బెట్టింగ్ మూలాలపై అందరం కలిసి పోరాడదామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందెన్నడూ తాను చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేయలేదని తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. కాగా వీసీ సజ్జనార్ సూచనల మేరకు హర్షసాయిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.