News January 9, 2025

Stock Markets: ఫార్మా, ఫైనాన్స్ షేర్లు డౌన్

image

బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలే అందాయి. Q3 results నిరాశాజనకంగా ఉంటాయన్న అంచనాతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నారు. నిఫ్టీ 23,608 (-83), సెన్సెక్స్ 77,902 (-245) వద్ద ట్రేడవుతున్నాయి. fmcg, media షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. bank, ఫైనాన్స్, ఫార్మా, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. కొటక్, hul, bajaj auto, itc టాప్ గెయినర్స్.

Similar News

News January 9, 2025

గంభీర్‌పై తివారీ విమర్శలు.. మద్దతుగా నిలిచిన ఆటగాళ్లు

image

గంభీర్ స్వార్థపరుడంటూ KKR మాజీ ఆటగాడు మనోజ్ తివారీ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై క్రికెటర్లు నితీశ్ రాణా, హర్షిత్ రాణా స్పందించారు. ఇద్దరూ తమ ఇన్‌స్టాలో గంభీర్‌కు మద్దతుగా పోస్ట్ చేశారు. ‘విమర్శలనేవి వ్యక్తిగత అభద్రత వల్ల కాక నిజానిజాల ఆధారంగా ఉండాలి. నేను కలిసినవారిలో అత్యంత నిస్వార్థపరుడు గౌతీ భయ్యా’ అని నితీశ్ పేర్కొనగా గంభీర్ ఆటగాళ్లకు అండగా నిలిచి వారిని వెలుగులోకి తెస్తారని హర్షిత్ పేర్కొన్నారు.

News January 9, 2025

14న ఢిల్లీకి సీఎం రేవంత్.. అక్కడి నుంచే విదేశాలకు

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 14న సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. 15న ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 16న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. 17న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లనున్న ఆయన రెండు రోజులు అక్కడ పర్యటిస్తారు. 19న సింగపూర్ నుంచి దావోస్‌కు వెళ్లి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు హాజరవుతారు. ఇదే పర్యటనలో ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉండగా రద్దయ్యింది.

News January 9, 2025

BREAKING: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం

image

TG: గ్రామస్థాయి ఉద్యోగులకు జీతాలు క్రమం తప్పకుండా చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జీతాలు చెల్లించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటు గ్రామస్థాయి ఉద్యోగులకు సైతం ఆలస్యం లేకుండా చెల్లించాలని స్పష్టం చేశారు. ఇటీవల గ్రామస్థాయి ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అవుతున్న ఘటనల నేపథ్యంలో సీఎం తాజా ఆదేశాలు జారీ చేశారు.