News January 23, 2025
Stock Markets: నష్టాలకే అవకాశం..

స్టాక్మార్కెట్లు నేడు నెగటివ్ జోన్లో మొదలయ్యే అవకాశముంది. గిఫ్ట్నిఫ్టీ 40pts మేర పతనమవ్వడం దీనినే సూచిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. క్రూడాయిల్, US బాండ్ యీల్డులు, బంగారం ధరలు తగ్గినప్పటికీ డాలర్ ఇండెక్స్ పెరగడం కలవరపెడుతోంది. నిఫ్టీ 23,150 పైస్థాయిలో నిలదొక్కుకోవడం కీలకం. నేడు DR REDDY, HPCL, ADANI ENERGY, ADANI GREEN ENERGY, TEJAS NETWORK ఫలితాలు రానున్నాయి.
Similar News
News November 21, 2025
యాషెస్ సిరీస్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్

యాషెస్ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
☛ AUS XI: ఖవాజా, వెదరాల్డ్, లబుషేన్, స్మిత్(C), హెడ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, లియాన్, బ్రెండన్ డాగెట్, బోలాండ్
☛ ENG XI: డకెట్, క్రాలే, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్(C), J స్మిత్, అట్కిన్సన్, కార్స్, ఆర్చర్, వుడ్
☛ LIVE: స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్
News November 21, 2025
iBOMMA రవి కేసును ఫ్రీగా వాదిస్తానన్న లాయర్.. తండ్రి ఏమన్నారంటే?

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసును ఉచితంగా వాదించి అతన్ని బయటకు తీసుకొస్తానంటూ సలీమ్ అనే న్యాయవాది ముందుకొచ్చారు. విశాఖ జిల్లా పెదగదిలి సాలిపేటలో ఉంటున్న రవి తండ్రి అప్పారావును ఆయన కలిశారు. కేసును వాదించేందుకు కొన్ని పేపర్లపై సంతకాలు పెట్టాలని కోరగా తాను నిరాకరించినట్లు అప్పారావు తెలిపారు. తన ఆరోగ్యం సహకరించనందున కోర్టుల చుట్టూ తిరగలేనని చెప్పానన్నారు.
News November 21, 2025
తిరుమల: సర్వదర్శనానికి 8 గంటల టైమ్

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. అటు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరుడిని 66,839 మంది దర్శించుకోగా, 19,220 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.61 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.


