News December 24, 2024
Stock Markets: మెటల్, రియాల్టి షేర్లపై ఒత్తిడి

బెంచ్మార్క్ సూచీలు ఫ్లాటుగా మొదలయ్యాయి. నిఫ్టీ 23,723 (-31), సెన్సెక్స్ 78,434 (-111) వద్ద ట్రేడవుతున్నాయి. అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. IT, O&G షేర్లకు డిమాండ్ నెలకొంది. మెటల్, రియాల్టి, ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలపై ఒత్తిడి ఉంది. టాటా మోటార్స్, TCS, NESTLE, BRITANNIA, BAJAJ AUTO టాప్ గెయినర్స్. JSW STEEL, TATA STEEL, AIRTEL, SBI LIFE టాప్ లూజర్స్.
Similar News
News January 9, 2026
TET ఫలితాలు విడుదల

AP: రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 2.48 లక్షల మంది ఎగ్జామ్స్ రాయగా 97,560 మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు అధికారిక <
News January 9, 2026
ఇంటర్ కాలేజీలకు సెలవులు ఎప్పుడంటే?

TG: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ఖరారు చేసింది. ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. మరోవైపు స్కూళ్లకు ఈనెల 10నుంచి 16వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే APలో ఇంటర్ కాలేజీల సెలవులపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
News January 9, 2026
రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

రాజాసాబ్ మూవీ టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వ మెమోను హైకోర్టు కొట్టేసింది. దీంతో పాత రేట్లకే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. కాగా తెలంగాణ హోంశాఖ కార్యదర్శి అర్ధరాత్రి తర్వాత హైక్ మెమో ఇచ్చారని, తనకు ఆ అధికారం లేదని లాయర్ శ్రీనివాస్ HCకి వెళ్లారు. దీంతో ఇకపై మెమోలు జారీ చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ రేట్స్ పెంచాలి అనుకుంటే జీవో 120 ప్రకారం రూ.350 మించకూడదని తేల్చిచెప్పింది.


