News December 5, 2024
STOCK MARKETS: మీడియా, ఫార్మా షేర్లలో ప్రాఫిట్ బుకింగ్

స్టాక్ మార్కెట్లు మోస్తరు లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, RBI MPC మీటింగ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎర్లీ సెషన్లో నిఫ్టీ 24,517 (+50), సెన్సెక్స్ 81,163 (+208) వద్ద ట్రేడవుతున్నాయి. మీడియా, ఫార్మా షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. IT, FMCG, O&G, కన్జూమర్ డ్యురబుల్స్ రంగాల సూచీలు ఎగిశాయి. NTPC, JSWSTEEL, BAJAJ AUTO, GRASIM టాప్ లూజర్స్.
Similar News
News September 14, 2025
తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాలు!

AP: గుంటూరు రూరల్(M) తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై ల్యాబ్లో చేసిన నీటి పరీక్షల్లో గుర్తించినట్లు సమాచారం. వీటితో పాటు స్ట్రాన్షియం అనే ఎలిమెంట్, ఈకొలి బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నీటిని తాగడం వల్లే స్థానికులు అనారోగ్యం బారిన పడినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇటీవల తురకపాలెంలో అనారోగ్యంతో పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే.
News September 14, 2025
HDFC బ్యాంకు సేవలకు అంతరాయం!

HDFC బ్యాంకు సేవలకు అంతరాయం కలుగుతోంది. UPI ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నామని చాలామంది వినియోగదారులు రిపోర్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనిపై బ్యాంక్ ఇంకా స్పందించలేదు. మీకు ఈ సమస్య ఎదురైందా? COMMENT
News September 14, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<