News January 31, 2025
Stock Markets: లాభాల్లో దూసుకెళ్తున్నాయ్..

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,359 (+110), సెన్సెక్స్ 77,038 (+280) వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఆటో, ఐటీ, ఫార్మా, మీడియా, రియాల్టి షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. LT, ట్రెంట్, టాటా కన్జూమర్స్, టైటాన్, BEL టాప్ గెయినర్స్. ఎయిర్టెల్, ITC హోటల్స్, ICICI బ్యాంకు, బజాజ్ ట్విన్స్ టాప్ లూజర్స్. నిఫ్టీ ADV/DEC రేషియో 43:8.
Similar News
News February 26, 2025
36 సార్లు ఢిల్లీకి.. 3 రూపాయలు తేలేదు: KTR

TG: 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తీసుకురాలేదని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైరయ్యారు. SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగితేలారని దుయ్యబట్టారు. 96 గంటలు దాటినా ముందడుగు వేయడం లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం పగుళ్లు, శ్రీశైలం అగ్నిప్రమాదంపై కారుకూతలు కూసిన మేధావులు SLBC విషయంలో మాత్రం నోరెత్తడం లేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు.
News February 26, 2025
మహాకుంభమేళా ‘సిత్రాలు’

జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు, నాగ సాధువులు, అఘోరాలు పుణ్య స్నానమాచరించారు. ఈ క్రమంలో పలు ఫొటోలు వైరలయ్యాయి. పైన స్వైప్ చేసి ఫొటోలను చూడొచ్చు.
News February 26, 2025
‘మజాకా’ మూవీ రివ్యూ

త్రినాథరావు దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మజాకా’ థియేటర్లలో విడుదలైంది. తండ్రి కొడుకులు తమ ప్రేమను దక్కించుకునేందుకు చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. సందీప్ కిషన్, రావు రమేశ్, మురళీ శర్మల నటన, ఎమోషనల్, కామెడీ సీన్లు, సొమ్మసిల్లిపోతున్నవే సాంగ్ ఈ సినిమాకు ప్లస్. సాగదీత, స్లో సీన్లు, ఊహించేలా కథ ఉండటం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్.
WAY2NEWS RATING: 2.25/5