News March 11, 2025
Stock Markets: గ్యాప్ డౌన్ నుంచి రికవరీ

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22497 (37), సెన్సెక్స్ 74,102 (-12) వద్ద స్థిరపడ్డాయి. గ్యాప్‌డౌన్లో మొదలైన సూచీలు నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. రియాల్టి, O&G, PSE, ఇన్ఫ్రా, ఫైనాన్స్, హెల్త్‌కేర్, మెటల్ షేర్లు ఎగిశాయి. బ్యాంకు, ఐటీ, ఆటో, మీడియా, FMCG షేర్లు తగ్గాయి. ట్రెంట్, BPCL, సన్‌ఫార్మా, ICICI బ్యాంకు, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్. ఇండస్‌ఇండ్, ఇన్ఫీ, M&M, టాప్ లూజర్స్.
Similar News
News April 6, 2026
BREAKING: ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్ విడుదల

ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన రాజధాని బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి ఇది అమలులోకి వస్తుందని ప్రకటనలో పేర్కొంది. CRDA-2014 చట్టంలో పొందుపరిచిన అమరావతిని రాజధానిగా కేంద్రం నోటిఫై చేసింది.
News April 6, 2026
జూన్ నుంచి మరింత తక్కువ ధరకు ఇన్సూరెన్స్?

IRDAI డెవలప్ చేసిన బీమా సుగమ్ పోర్టల్‌లో జూన్ నుంచి జీరో కమీషన్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్లతో పనిలేకుండా ఇన్సూరెన్స్ సంస్థలు ఈ పోర్టల్‌కు కేవలం 5-7% ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఫలితంగా ప్రీమియమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. JUNలో వెహికల్ ఇన్సూరెన్స్ లాంచ్ కానుంది. ఇక AUGలో హెల్త్ ఇన్సూరెన్స్, SEPలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
News April 6, 2026
60 ఏళ్ల వరకే బీమా.. ప్రభుత్వం సంప్రదింపులు!

TG: రూ.5 లక్షల <<19431944>>బీమా<<>> పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తోంది. కాగా ఇలాంటి బీమా 60 ఏళ్ల వయసు వరకే వర్తిస్తుందని జీవిత బీమా సంస్థల నుంచి సర్కారుకు సమాచారం అందింది. అయితే అన్ని వయసుల వారికి వర్తింపజేసే అవకాశం ఏదైనా ఉందా? అనే విషయంపై ఆర్థిక శాఖ అధికారులు వివిధ బీమా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. 2026-2027 బడ్జెట్‌లో ఈ కొత్త పథకం కోసం రూ.4,000 కోట్లు కేటాయించారు.


