News December 27, 2024

Stock Markets: లాభాల్లో పరుగులు..

image

స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందాయి. ఇన్వెస్టర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న మంచి స్టాక్స్‌ను కొంటున్నారు. సెన్సెక్స్ 78,896 (+424), నిఫ్టీ 23,858 (+108) వద్ద ట్రేడవుతున్నాయి. రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. బ్యాంకు, ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు జోరుమీదున్నాయి. BAJAJAUTO, TATAMOTORS, DRREDDY, EICHERMOT, INDUSIND టాప్ గెయినర్స్.

Similar News

News December 28, 2024

TG ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్‌న్యూస్

image

తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించకపోవడంపై విమర్శలు వస్తుండటంతో టీటీడీ స్పందించింది. ఇకపై వారానికి రెండు సార్లు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది. ఇటీవల మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మంత్రి కొండా సురేఖ కూడా ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News December 28, 2024

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా పోయిన పోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
తాత్పర్యం: టెంకాయ లోపలికి నీరు వచ్చినట్లు సంపద తెలియకుండానే వస్తుంది. ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జు మాదిరి సంపద తెలియకుండానే మాయమవుతుంది.

News December 28, 2024

జర్మనీ పార్లమెంట్ రద్దు.. FEB 23న ఎలక్షన్స్

image

జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ అక్కడి పార్లమెంట్‌ను రద్దు చేశారు. ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఇటీవల జరిగిన ఓటింగ్‌లో అక్కడి సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంట్ విశ్వాసాన్ని కోల్పోయింది. 733 మంది సభ్యులున్న సభలో అనుకూలంగా 207, వ్యతిరేకంగా 394 మంది ఓట్లు వేశారు.