News December 6, 2024
STOCK MARKETS: ఐటీ, మీడియా షేర్లపై సెల్లింగ్ ప్రెజర్

RBI MPC మీటింగ్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. వడ్డీరేట్ల తగ్గింపుపై రకరకాల అంచనాలు ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రస్తుతం నిఫ్టీ 24,712 (+4), సెన్సెక్స్ 81,784 (+23) వద్ద ట్రేడవుతున్నాయి. IT, మీడియా, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఆటో, FMCG, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. TCS, LT, WIPRO టాప్ లూజర్స్.
Similar News
News April 3, 2026
1,000 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

పంజాబ్&సింధ్ బ్యాంకులో 1,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. TGలో 30 పోస్టులున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, ఏదైనా బ్యాంకులో 18 నెలల పని అనుభవం ఉన్న వారు అర్హులు. అప్లై చేసిన వారికి సంబంధిత రాష్ట్రంలోని లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. 20-30 ఏళ్ల వయసుండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ APR 20.
వెబ్‌సైట్: https://punjabandsind.bank.in/
News April 3, 2026
ఈనెల 29న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం?

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యా రెడ్డి <<19338854>>వివాహ<<>> ముహూర్తం ఖరారైనట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈనెల 5న ఓ ఫామ్‌హౌస్‌లో కుటుంబీకులు, సెలబ్రిటీల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు పేర్కొన్నాయి. అలాగే ఏప్రిల్ 29న తిరుమలలో వీరి వివాహం జరగనున్నట్లు చెప్పాయి. దీనిపై త్వరలోనే బెల్లంకొండ కుటుంబం అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.
News April 3, 2026
ప్రసవం తర్వాత డిప్రెషన్‌లోకి తండ్రులు: అధ్యయనం

బిడ్డ పుట్టిన తర్వాత తండ్రులకూ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందని JAMA నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 30%మంది తండ్రులు ఈ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నిద్రలేమి, పెరిగిన బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలు. తండ్రి డిప్రెషన్‌లో ఉంటే అది తల్లి ఆరోగ్యం, బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.


