News January 21, 2025
Stock Markets: రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్

గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 76942 (-130), నిఫ్టీ 23,346 (5) వద్ద కొనసాగుతున్నాయి. BRICS దేశాలపై 100% టారిఫ్ విధిస్తానని ట్రంప్ చెప్పడం నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, O&G షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. BPCL, APOLLOHOSP టాప్ గెయినర్స్.
Similar News
News November 20, 2025
HYD: మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపణలను ఖండిస్తున్నాం: రాంచందర్‌రావు

ఆపరేషన్ కగార్ విషయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఖండించారు. HYDలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను కక్షపూరితంగా చంపుతోందంటూ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు. నక్సల్స్‌ను ‘పేదల కోసం పోరాడిన వారు’ అని చెప్పడం దుర్మార్గం, సిగ్గుచేటని మండిపడ్డారు.
News November 20, 2025
22, 23 తేదీల్లో పుట్టపర్తిలో సీఎం పర్యటన

AP: ఈ నెల 22, 23 తేదీల్లో CM CBN పుట్టపర్తిలో పర్యటించనున్నారు. 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలికి ఆమెతో కలిసి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలకనున్నారు. ఆపై శ్రీసత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. రాత్రికి పుట్టపర్తిలోనే బస చేసి 23న ఉండవల్లికి తిరుగుపయనమవుతారు.
News November 20, 2025
సర్కార్‌కు రిజర్వేషన్ల నివేదిక.. వచ్చే వారం షెడ్యూల్!

TG: సర్పంచ్ ఎన్నికలు DEC 10-20 మధ్య పూర్తి చేయాలని EC నిర్ణయించింది. వచ్చే వారం షెడ్యూల్ ఇచ్చి తర్వాత నోటిఫికేషన్ ప్రకటించనుంది. 3 విడతల్లో(DEC 11,14,17) పోలింగ్‌కు సిద్ధమవుతోంది. అటు రిజర్వేషన్లపై డెడికేషన్ కమిషన్ సర్కార్‌కు నివేదిక అందజేసింది. 50శాతానికి మించకుండా వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను సిఫార్స్ చేసింది. రేపు ప్రభుత్వం దాన్ని పంచాయతీరాజ్ శాఖకు అప్పగించనుంది.


